HARTAL
-
కేరళలో హింసాత్మకంగా మారిన హర్తాళ్
-
రణరంగంగా కేరళ
తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశం కేరళను రణరంగంగా మార్చింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగిన హిందూ సంస్థల కార్యకర్తలు రోడ్లకు అడ్డంగా కాలిపోతున్న టైర్లు, గ్రానైట్ పలకలు ఉంచి నిరసనకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. శబరిమల కర్మ సమితి ఇచ్చిన 12 గంటల హర్తాళ్ పిలుపు మేరకు వందలాది మంది హిందూ అనుకూల సంస్థల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి వీరంగం సృష్టించారు. అధికార సీపీఎం కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. మీడియా ప్రతినిధులకు కూడా నిరసనల సెగ తాకింది. ఆందోళనకారుల దాడిలో పలువురు పాత్రికేయులు గాయాలపాలయ్యారు. పోలీసులు, సీపీఎం కార్యకర్తలతో ఆందోళనకారులు ఘర్షణలకు దిగడంతో చాలా ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు రోజుల వ్యవధిలో 266 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు 334 మందిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితిపై నివేదిక సమర్పించాలని గవర్నర్ పి. సదాశివం ముఖ్యమంత్రి విజయన్ను ఆదేశించారు. తాజా హింసకు బీజేపీ, ఆరెస్సెస్‌లే కారణమని విజయన్ ఆరోపించారు. మరోవైపు, శబరిమల ఆలయాన్ని ఇద్దరు మహిళలు దర్శించుకున్న తరువాత గర్భగుడిని శుద్ధిచేయడంపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బీజేపీ కార్యకర్తలకు కత్తిపోట్లు.. త్రిసూర్‌లో సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ) కార్యకర్తలతో జరిగిన ఘర్షణలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు కత్తిపోట్లకు గురయ్యారు. కోజికోడ్, కన్నూర్, మలప్పురం, పాలక్కడ్, తిరువనంతపురం తదితర పట్టణాల్లోనూ బీజేపీ, శబరిమల కర్మ సమితి కార్యకర్తల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేనన్స్ ప్రయోగించి, లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. పాలక్కడ్‌లో సీపీఎం కార్యాలయంపై దాడికి పాల్పడిన నిరసనకారులు, దాని ముందు నిలిపిన వాహనాల్ని ధ్వంసం చేశారు. కన్నూర్ జిల్లాలోని తాలసెరిలో సీపీఎం నిర్వహణలో ఉన్న బీడీ తయారీ కేంద్రంపై నాటుబాంబు విసిరారు. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న 10 మందిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. మీడియాపై దాడికి నిరసనగా తిరువనంతపురంలో పాత్రికేయులు ఆందోళనకు దిగారు. బీజేపీ, శబరిమల కర్మ సమితి కార్యక్రమాలను బహిష్కరించాలని కేరళ మీడియా వర్కింగ్ యూనియన్ నిర్ణయించింది. హర్తాళ్ వల్ల దుకాణాలు, ఇతర వాణిజ్య సముదాయాలు మూతపడటంతో జనజీవనం స్తంభించింది. గురువారం కాంగ్రెస్ ‘బ్లాక్ డే’గా పాటించింది. పాతనంతిట్టా జిల్లాలోని పాండలమ్లో సీపీఎం కార్యకర్తలు తమ కార్యాలయ భవనం పైనుంచి రాళ్లు రువ్వడంతో తీవ్రంగా గాయపడిన 55 ఏళ్ల ఉన్నితాన్ చనిపోయారు. బుధవారం సాయంత్రం శబరిమల కర్మ సమితి చేపట్టిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ దాడిలో పాల్గొన్న 9 మందిని గుర్తించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఉన్నితాన్ గుండెపోటుతో మరణించాడని ముఖ్యమంత్రి విజయన్ వెల్లడించారు. చెన్నైలో కేరళ సీఎం దిష్టిబొమ్మ దహనం సాక్షి, చెన్నై: శబరిమల ఆందోళనలు చెన్నైకీ విస్తరించాయి. పల్లవరంలో బీజేపీ కార్యకర్తలు కేరళ సీఎం విజయన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్‌ని అయ్యప్ప ఆలయంలోకి అనుమతించని కేరళ ప్రభుత్వం ఇద్దరు మహిళల్ని మాత్రం బందోబస్తుతో పంపిందని తమిళనాడు బీజేపీ చీఫ్ సౌందరరాజన్ విమర్శించారు. హింస వెనక బీజేపీ, ఆరెస్సెస్: విజయన్ హర్తాళ్ మద్దతుదారులు హింసకు పాల్పడటం వెనక పక్కా ప్రణాళిక ఉందని సీఎం విజయన్ పేర్కొన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ హింసను ప్రేరేపించాయని, ఈ అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. శబరిమలకు వెళ్లిన ఇద్దరిని ప్రభుత్వం తీసుకెళ్లలేదని, వారు సాధారణ భక్తులలాగే ఆలయ సందర్శనకు వెళ్లారని చెప్పారు. వారిని హెలికాప్టర్లో తరలించారన్న వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ హర్తాళ్ చేయడమంటే సుప్రీంకోర్టు తీర్పును శంకించడమేనని పేర్కొన్నారు. మహిళల దర్శనం తరువాత ఆలయాన్ని శుద్ధిచేసిన పూజారుల తీరును కూడా విజయన్ తప్పుబట్టారు. ఢిల్లీలో కేరళ సీఎం విజయన్ దిష్టిబొమ్మను దగ్ధంచేస్తున్న అయ్యప్ప ధర్మ సంరక్షక సమితి సభ్యులు -
హర్తాళ్ విజయవంతంపై వైఎస్ జగన్ కృతజ్ఞతలు
హైదరాబాద్: పెద్ద నోట్లను రద్దు చేయడం మూలంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైనందకు గాను సోమవారం నిర్వహించిన హర్తాళ్ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. హర్తాళ్‌ను విజయవంతం చేసిన అన్ని వర్గాల ప్రజలు, సామాజిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, రాజకీయ పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
హర్తాళ్ ప్రశాంతం
► జిల్లావ్యాప్తంగా నిరసనలు, రాస్తారోకోలు, మానవహారాలు ► అనుమతులు లేవంటూ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు ►స్వచ్ఛందంగా మూతపడ్డ వ్యాపార, విద్యా సంస్థలు ►యధావిధిగా పనిచేసిన బ్యాంకులు, కొన్ని చోట్ల మూతపడ్డ ఏటీఎంలు సాక్షి, విశాఖపట్నం: పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలకు నిరసనగా విపక్షాలు నిర్వ హించిన హర్తాళ్ సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. ఉదయం నుంచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్ష నేతలు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నగరంలో, రూరల్‌లో భారీగా రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు తగులబెట్టారు. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు హర్తాళ్‌కు సహకరించారుు. స్వచ్ఛందంగా దుకాణాలు, స్కూళ్లు మూతపడ్డారుు. కరెన్సీ కష్టాలకు నిరసనగా చేపట్టిన కార్యక్రమం కావడంతో వారి నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. వైఎస్సార్సీపీ, వామపక్షాల నిరసన యత్నాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. నిరసనకారులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. వందలాదిమందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. బ్యాంకులు, ఏటీఎంలు యధావిధిగా పనిచేస్తాయని ముందుగా చెప్పినప్పటికీ చాలాచోట్ల అవి కూడా మూత పడ్డారుు. హర్తాళ్ నుంచి ఆర్టీసీని మినహారుుంచడంతో బస్సులు నడిచారుు. అరెస్టుల పర్వం మద్దిలపాలెం జంక్షన్ జాతీయ రహదారిపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, తూర్పు నియోజకవర్గం కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిపో వద్ద బైఠారుుంచి కొద్దిసేపు నిరసన తెలిపారు. దీంతో పోలీసులు రంగంలో దిగి పార్టీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీపీఐ, సీపీఎం కార్యకర్తలు మద్దిలపాలెం నుంచి ర్యాలీ నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు వెళ్లాల్సిన ర్యాలీకి పోలీసులు అనుమతులు నిరాకరించి, స్వర్ణభారతి స్టేడియం వద్ద ఆరెస్ట్లు చేపట్టి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జగదాంబ వద్ద సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాథం, సీపీఐ నగర కార్యదర్శి మార్కండేయులు కార్యకర్తలు, ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించడంతోపాటు ఆర్టీసీ బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అనుమతి లేకుండా నిరసన చేపట్టారంటూ నర్సీపట్నంలో కొంతమంది వామపక్ష నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్సార్సీపీ దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆధ్వర్యంలో 15వ వార్డులోని దొండపర్తిలోని ఎరుకుమాంబ ఆలయం సమీపంలోని జంక్షన్లో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. చోడవరంలో అఖిలపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పెందుర్తి కూడలి వద్ద భారీ మానవహారం చేసి రోడ్డుపై నాయకులు బైఠారుుంచారు. వారి నిరసనను పోలీసులు అడ్డుకుని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్, సీపీఎం నాయకులు అప్పలరాజు, అనంతలక్ష్మి, సీపీఐ నాయకులు శ్రీనివాసరావు, రాంబాబు సహా 100 మందిని అరెస్ట్ చేశారు. గాజువాకలో 17 మంది వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను, 13 మంది వాపపక్ష నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్ఎడీ జంక్షన్లో నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్‌తోపాటు ఏడుగురిని అరెస్ట్ చేశారు. అచ్యుతాపురం, పాయకరావుపేట, యలమంచిలిలోనూ వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ నాయకులను అరెస్ట్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు పాక్షికంగా మూతపడ్డారుు. బ్యాంకులు తెరుచుకున్నప్పటికీ ఏటీఎంలు చాలా వరకూ పనిచేయలేదు. దీంతో ఎప్పటిలాగే జనానికి క్యూ బాధ తప్పలేదు. సిటీలో 9 కేసులు నమోదు చేసి 209 మందిని అరెస్ట్ చేశారు. రూరల్ పరిధిలో ఆరు కేసులు పెట్టి 102 మందిని అరెస్ట్ చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి: ప్రాంతం వైఎస్సార్ సీపీఐ సీపీఎం కాంగ్రెస్ స్టూడెంట్స్ మొత్తం సిటీ 53 77 76 0 3 209 రూరల్ 27 38 34 3 0 102 -
హర్తాళ్ సక్సెస్..
‘అనంత’లో భారీ ర్యాలీ చేపట్టిన వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు ఆందోళనకారులను ఎక్కడికక్కడ అరెస్టు చేసిన పోలీసులు..స్టేషన్లలోనూ కొనసాగిన నిరసనలు విద్యాసంస్థలకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించి.. మద్దతు తెలిపిన యాజమాన్యాలు అనంతపురంలో విపక్షాలు వేర్వేరుగా ఆందోళనలు చేపట్టాయి. వైఎస్సార్కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు ఎర్రిస్వామిరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాంబశివారెడ్డి, మాజీ మేయర్ రాగేపరుశురాం, సంయుక్తకార్యదర్శి నదీమ్‌తో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. యువజన విభాగం ఆధ్వర్యంలో యువకులు ర్యాలీకి తరలివచ్చారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి నగరం మొత్తం ర్యాలీ చేశారు. టవర్క్లాక్వద్ద నాయకులను పోలీసులు అరెస్టు చేసి.. రూరల్ స్టేషన్ కు తరలించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్ ఆధ్వర్యంలో కూడా నగరంలో ర్యాలీ నిర్వహించారు. సీపీఎం ఆధ్వర్యంలో ఆర్టీసీబస్టాండ్ ఎదుట బైఠాయించి.. బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆపై వారు నగరంలో ర్యాలీ నిర్వహించారు. సీపీఎం రాష్ట్రనేత ఓబులు, జిల్లా కార్యదర్శి రాంభూపాల్, రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటా సత్యం ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని అడ్డుకునేందుకు సీఐ శుభకుమార్ యత్నించగా, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు దాదాగాంధీ సీఐ కాళ్లుపట్టుకుని ర్యాలీకి సహకరించాలని కోరారు. గుంతకల్లులో తెల్లవారుజామున విపక్షనేతలు బీరప్పగుడి సర్కిల్లో రాస్తారోకో చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆపై విద్యార్థులు, యువకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్త వెంకట్రామిరెడ్డిని గృహనిర్బంధం చేశారు. ధర్మవరంలో ప్రముఖ నేతలందరినీ ఇళ్లవద్ద అరెస్టుచేసి.. స్టేషన్లకు తరలించారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ శ్రేణులు బైక్‌ర్యాలీ నిర్వహించాయి. కాంగ్రెస్, వామపక్షాలు పట్టణంలో ర్యాలీ చేపట్టాయి. రాప్తాడులో విపక్షాలు బెంగళూరు హైవేపై బైఠాయించి రాస్తారోకో చేశాయి. నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ, సీపీఐ, బీఎస్పీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, కర్ణాటక బ్యాంకు ఎదుట బైఠాయించారు. రాయదుర్గంలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నేతలు.. స్థానిక వినాయక్సర్కిల్కు ర్యాలీగా చేరుకున్నారు. వీరందరినీ పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్లకు తరలించారు. ఆపై వైఎస్సార్సీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. పుట్టపర్తిలో వైఎస్సార్సీపీ నేతలు ర్యాలీ చేపట్టి.. గణేశ్సర్కిల్లో ఆందోళన చేశారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. శింగనమలలో విపక్షనేతలు సమష్టిగా ర్యాలీ చేశారు. బుక్కరాయసముద్రం, పుట్లూరులో ర్యాలీ చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. గార్లదిన్నెలో నేతలందరినీ ముందస్తు అరెస్టు చేశారు. కదిరిలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి ర్యాలీలో ఉండగా.. పోలీసులు మధ్యలోనే అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. వామపక్ష, కాంగ్రెస్‌నేతలను కూడా అరెస్టు చేశారు. స్టేషన్లలో విపక్ష సభ్యులంతా కలిసి ధర్నా చేపట్టారు. మడకశిరలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త తిప్పేస్వామి ఆధ్వర్యంలో ర్యాలీ, తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. సీపీఎం నేతలు తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఉరవకొండలో విపక్షనేతలు వేర్వేరుగా ఆందోâýæనలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ నేతలు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, రూ.2వేల జిరాక్స్ నోట్లను కాల్చి నిరసన తెలియజేశారు. ఆపై ధర్నా చేపట్టారు. నాయకులను పోలీసులు అరెస్టు చేసి..స్టేషన్ కు తరలించారు.స్టేషన్ లోనూ నిరసన ప్రదర్శన చేపట్టారు. పెనుకొండలో విపక్షనేతలు వేర్వేరుగా ఆందోâýæన నిర్వహించారు. వైఎస్సార్సీపీ నేతలు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టగా, మధ్యలోనే పోలీసులు అరెస్టు చేశారు. ర్యాలీ చేస్తున్న వామపక్షసభ్యులను కూడా అరెస్టు చేశారు. హిందూపురంలో వైఎస్సార్సీపీ నేతలు ర్యాలీ నిర్వహించి.. అంబేడ్కర్సర్కిల్లో బైఠాయించారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆపై వామపక్షాలు, కాంగ్రెస్, బీఎస్పీ నేతలు బైఠాయించి ఆందోళన చేపట్టారు. వారిని కూడా అరెస్టు చేశారు. కళ్యాణదుర్గంలో విపక్షనేతలు ర్యాలీ నిర్వహించారు. టీసర్కిల్లోరాస్తారోకో చేపట్టారు. నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. బస్సుల్లో తగ్గిన రద్దీ అనంతపురం న్యూసిటీ: హర్తాళ్ ప్రభావంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ తగ్గింది. సోమవారం అనంతపురం రీజియన్ పరిధిలోని 13 డిపోల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలు తమ ప్రయాణాలను స్వచ్ఛందంగా వాయిదా వేసుకున్నారు. ఆర్టీసీ దాదాపు రూ.20 లక్షల మేర ఆదాయం కోల్పోయినట్లు సమాచారం. -
ఆర్టీసీకి రూ.15 లక్షల నష్టం
కర్నూలు(రాజ్‌విహార్): రోడ్డు రవాణ సంస్థపై హర్తాళ్ ప్రభావం కనిపించింది. బస్సులు 85శాతం మాత్రమే తిరగడంతో ఆర్టీసీకి రూ.15లక్షల నష్టం వచ్చినట్ల కర్నూలు రీజినల్ మేనేజరు జి. వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ప్రతిపక్షాలు సోమవారం నిరసన నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయం నుంచే పలు చోట్ల ఆందోళనకారులు బస్సులను నిలిపివేశారు. బయటకు వెళ్లిన బస్సులను సైతం రోడ్లపై ఆపేశారు. మధ్యాహ్నం తరువాత యథావిధిగా సర్వీసులన్నీ పునరుద్ధరణ అయ్యాయి. -
హర్తాళ్ సక్సెస్!
మూతపడిన దుకాణాలు, విద్యాసంస్థలు – ఎక్కడికక్కడ నేతలను అరెస్టు చేసిన పోలీసులు – ఉదయం నుంచే బస్ డిపోల ఎదుట నేతల బైఠాయింపు – బ్యాంకులకు మినహాయింపు – అయినా తెరుచుకోని ఏటీఎంలు – బ్యాంకుల్లోనూ దర్శనమిచ్చిన నో క్యాష్ బోర్డులు సాక్షి ప్రతినిధి, కర్నూలు: నోట్ల రద్దు అనంతరం ఏర్పడిన ఇబ్బందికర పరిస్థితులను పరిష్కరించాలంటూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్తాళ్ కార్యక్రమం విజయవంతమయింది. సోమవారం తెల్లవారుజాము నుంచే పార్టీ నేతలు, కార్యకర్తలు బస్టాండులోకి వెళ్లి హర్తాళ్ నిర్వహించారు. బస్‌డిపోల ఎదుట బైఠాయించి బస్సులు బయటకు రాకుండా నిరసన చేపట్టారు. దుకాణాలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాయి. అయితే, పోలీసులు మాత్రం ఉదయాన్నే ఎక్కడికక్కడ నేతలను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్లకు తరలించారు. మరోవైపు నోట్ల రద్దుకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు బంద్ నిర్వహించాయి. ఎక్కడికక్కడ వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నిరసన నుంచి బ్యాంకులకు మినహాయింపునిచ్చారు. అయినప్పటికీ నోట్ల రద్దు కష్టాలు యథావిధిగా కొనసాగాయి. నగదు రాకపోవడంతో ఏటీఎంలు తెరుచుకోలేదు. బ్యాంకుల్లో కూడా నోక్యాష్ బోర్డులు దర్శనమిచ్చాయి. బనగానపల్లె నియోజకవర్గంలో కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా హర్తాళ్ నుంచి మినహాయింపునిచ్చారు. కర్నూలులో ఉదయం 6 గంటలకే వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు వామపక్ష నేతలు, కార్యకర్తలు బస్టాండు వద్దకు చేరుకుని బస్సులు డిపోల నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరిత బస్టాండు వద్ద నిరసనలో పాల్గొన్నారు. నోట్ల రద్దుతో ఏర్పడిన ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని గౌరు డిమాండ్ చేశారు. అంతకు ముందు ఉదయం 9 గంటలకు పోలీసులు రంగప్రవేశం చేసి వైఎస్సార్సీపీ నేతలను హఫీజ్‌ఖాన్, సురేందర్ రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులును పోలీసులు అరెస్టు చేశారు. వామపక్ష కార్యకర్తలు జెడ్పీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించగా.. పోలీసులు అరెస్టు చేశారు. -
’పశ్చిమ’లో హర్తాళ్ విజయవంతం
పలువురి అరెస్ట్ సాక్షి ప్రతినిధి, ఏలూరు : ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని నిరసిస్తూ విపక్షాల ఆధ్వర్యంలో సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో హర్తాళ్ నిర్వహించారు. పలుచోట్ల వైఎస్సార్ సీపీ, వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు బందోబస్తు నడుమ ఆర్టీసీ బస్సులు నడిచాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు సెలవు ప్రకటించారు. చాలాచోట్ల దుకాణాలు, వ్యాపారాలు మూసివేశారు. తణుకులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరులో వామపక్షాల నాయకులు స్థానిక జ్యట్మిల్లు వద్ద ధర్నా నిర్వహించారు. వైఎసార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, మంచెం మైబాబు ఆధ్వర్యంలో పార్టీ ఽనగరంలో ర్యాలీ నిర్వహించి, దుకాణాలు మూసివేయాల్సిందిగా కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫైర్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బుట్టాయగూడెంలో భారీ ర్యాలీతో పాటు మానవహారం, రాస్తారోకో చేశారు. తాడేపల్లిగూడెంలో ఉదయం 5 గంటలకు ఆర్టీసీ డిపో నుండి బస్సులను రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించిన వైసీపీ, వామపక్ష పార్టీలకు చెందిన సుమారు 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పట్టణంలో, పెంటపాడు మండలంలో ప్రదర్శన నిర్వహించారు. భీమడోలు జంక్షన్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. -
అక్కడ డబ్బులు పంపిణీ చేయడమేంటి?
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుపై జరిగిన హర్తాళ్ కు ప్రజలు మద్దతు ప్రకటించారని వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. సోమవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యాలు, అరెస్టులు చేయిందని విమర్శించారు. ప్రజల ఇబ్బందులు పట్టవా, నోట్ల కష్టాలపై మీ వైఖరేంటని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలిపే అవకాశం లేదా అని నిలదీశారు. ప్రజా సమస్యలపై పోరాడితే గృహనిర్బంధాలా అని వాపోయారు. చంద్రబాబుతో భాగస్వామ్యం ఉన్న ఫ్యూచర్ గ్రూపు ఔట్ లెట్లలో ప్రజలకు డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఏటీఎంలు ఉండగా... ఫ్యూచర్ గ్రూపుతో చేసుకున్న ఒప్పందం ఏంటని అడిగారు. -
అక్కడ డబ్బులు పంపిణీ చేయడమేంటి?
-
జమ్ము కశ్మీర్లో విపక్షల హర్తాళ్ ఉద్రిక్తత
-
హర్తాళ్ లో ప్రముఖ నేతల అరెస్టు
అధిక విలువ కలిగిన నోట్ల రద్దుపై సోమవారం తెలుగురాష్ట్రాల్లో విపక్షాలు చేపట్టిన హర్తాళ్ లో పలువురు ప్రముఖ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం: తమ్మినేని సీతారం, వి. కళావతి తూర్పుగోదావరి: తోట సుబ్బారాయుడు, ఆవాల లక్ష్మీ నారాయణ విశాఖపట్టణం: ధనిశెట్టి బాబూరావు కృష్ణా: సామినేని ఉదయభాను చిత్తూరు: భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గుంటూరు: ఎమ్మెల్యే ముస్తఫా, లేళ్ల అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్ అనంతపురం: వై.వెంకటరామిరెడ్డి, డా.సిద్ధారెడ్డి కర్నూలు: హఫీజ్ ఖాన్ కరీంనగర్: ముకుందరెడ్డి హైదరాబాద్: ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ -
తెలుగు రాష్ట్రాల్లో హర్తాళ్, పలువురి అరెస్టు
అధిక విలువ కలిగిన నోట్ల రద్దు వల్ల సాధారణ ప్రజలే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారంటూ విపక్షాలు సోమవారం దేశవ్యాప్తంగా హర్తాళ్ కు పిలుపునిచ్చాయి. హర్తాళ్ ద్వారా ప్రజల కష్టాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని కూడా పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని తెలంగాణ, ఏపీలో హర్తాళ్ కు మద్దతు తెలుపుతున్నట్లు వైఎస్సార్సీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగురాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో హర్తాళ్ ప్రభావం ఎలా ఉందో ఓ సారి చూద్దాం. [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] శ్రీకాకుళం: తెల్లవారుజామునుంచే జిల్లాలోని ఆర్టీసీ డిపో వద్ద విపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. ఆర్టీసీ బస్సులను ఆందోళనకారులు అడ్డుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి పదకొండు మందిని అరెస్టు చేశారు. వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారంను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పాలకొండలో నిరసన ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేత వి.కళావతిని అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. వైఎస్సార్ జిల్లా: కడప, ప్రొద్దుటూరుల్లోని ఆర్టీసీ డిపోల్లో కాంగ్రెస్, సీపీఐ నేతలు ధర్నాకు దిగారు. బస్సులను అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి: జిల్లాలోని జంగారెడ్డి గూడెం బస్టాండ్ వద్ద వైఎస్సార్సీపీ, వామపక్ష పార్టీలు ధర్నాకు దిగాయి. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ద్వారకా తిరుమలలో వైఎస్సార్సీపీతో కలిసి వామపక్షాలు బంద్ ను నిర్వహించాయి. ఏలూరులో వైఎస్సార్సీపీ శ్రేణులు బైక్ ర్యాలీని నిర్వహించారు. ప్రకాశం: జిల్లాలోని చీరాలలో వైఎస్సార్సీపీ, వామపక్షాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. హర్తాళ్ కు మద్దతుగా కందుకూరులో వైఎస్సార్సీపీ, వామపక్ష ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. దర్శి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేత బూచేపల్లి శివ ప్రసాద్ ఆధ్వర్యంలో హర్తాళ్ నిర్వహించారు. తూర్పు గోదావరి: సామర్లకోట స్టేషన్ సెంటర్లో వైఎస్సార్సీపీ హర్తాళ్ ను నిర్వహించింది. కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు తోట సుబ్బరాయుడు, ఆవాల లక్మీ నారాయణ సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్టణం: జిల్లాలోని మునగపాకలో వైఎస్సార్సీపీ నేత బొడ్డేడ ప్రసాద్, మద్దిలపాలెంలో వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. పాయకరావుపేటలో హర్తాళ్ లో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేత ధనిశెట్టి బాబూరావుతో సహా సీపీఎం, సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అనకాపల్లిలో వైఎస్సార్సీపీ, వామపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. నెల్లూరు: కోవూరులో వైఎస్సార్సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆత్మకూరులో ఆందోళన చేపట్టిన వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా: జిల్లాలోని జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో ముందు వైఎస్సార్సీపీ నేతలు బైఠాయించారు. జగ్గయ్యపేటలో కార్యకర్తలతో ర్యాలీని నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ నేత సామినేని ఉదయభాను పోలీసులు అరెస్టు చేశారు. నందిగామలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. చిత్తూరు: తిరుపతిలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్యే నారాయణ రెడ్డిలు ఆందోళన చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు భూమన, నారాయణ రెడ్డిలను అరెస్టు చేశారు. ఆర్టీసీ బస్టాండులో పోలీసులు బందోబస్తు మధ్య అధికారులు బస్సులను నడుపుతున్నారు. మరో వైపు వైఎస్సార్ సీపీ నేత కోనేటి ఆదిములం ఆధ్వర్యంలో నారాయణ వనం హైవేపై కార్యకర్తలు ధర్నా నిర్వహిస్తున్నారు. వాల్మీకిపురంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆందోళన చేపట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన చేపట్టారు. విద్యాసంస్ధలు, వాణిజ్య సముదాయాలు స్వచ్చందంగా మూతపడ్డాయి. గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా, మేరుగ నాగార్జునల ఆధ్వర్యంలో గుంటూరు ఆర్టీసీ బస్టాండును కార్యకర్తలు ముట్టడించారు. మరో వైపు వామపక్షాలు బస్సులను డిపో నుంచి కదలినివ్వకుండా అడ్డుకుంటున్నాయి. దాచేపల్లికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత జంగా కృష్ణమూర్తి, చిలకలూరిపేట వైఎస్సార్సీపీ నేత మర్రి రాజశేఖర్ లను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అనంతపురం: ఉరవకొండ ఆర్టీసీ డిపో ఎదుట సీపీఐ, కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. గుత్తి, గుంతకల్లులలో ఆందోళనలు చేపట్టిన వైఎస్సార్సీపీ, వామపక్షాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు జాగ్రత్తగా వైఎస్సార్సీపీ నేత వై. వెంకటరామిరెడ్డిని గృహనిర్బంధం చేశారు. కదిరిలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేత డా.సిద్ధారెడ్డి సహా 100మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు: కర్నూలు ఆర్టీసీ డిపో ఎదుట ధర్నాకు దిగిన వైఎస్సార్సీపీ నేత హఫీజ్ ఖాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. బస్సుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఆలూరులో నిర్వహించిన హర్తాళ్ లో అఖిలపక్ష నేతలు పాల్గొన్నారు. విజయనగరం: హర్తాళ్ కు మద్దతుగా జిల్లాలోని అన్ని ప్రైవేటు విద్యాసంస్ధలు, థియేటర్లు, వాణిజ్య సముదాయాలు స్వచ్చందంగా మూతపడ్డాయి. విజయనగరం చాంబర్ ఆఫ్ కామర్స్ కూడా హర్తాళ్ కు మద్దతు ప్రకటించింది. మహబూబాబాద్: మహబూబాబాద్ ఆర్టీసీ డిపో ముందు ఆందోళనకారులు బైఠాయించారు. దీంతో బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. కరీంనగర్: కరీంనగర్ ఆర్టీసీ డిపోలో బస్సులను అడ్డుకునేందుకు సీసీఎం యత్నించింది. దీంతో జిల్లా కార్యదర్శి ముకుందరెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బస్సు సర్వీసులు యథావిధిగా నడుస్తున్నాయి. మెదక్: జిల్లాలో హర్తళ్ ప్రభావం కనిపించడం లేదు. ఆర్టీసీ సర్వీసులను నడుపుతోంది. సంగారెడ్డి: సంగారెడ్డిలో హర్తళ్ ప్రభావం కనిపించడం లేదు. ఆర్టీసీ బస్సుల సర్వీసులు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఖమ్మం: జిల్లాలోని సత్తుపల్లి డివిజన్ లో హర్తాళ్ ప్రభావం కనిపిస్తోంది. వ్యాపారులు, వాణిజ్య సముదాయాలు స్వచ్చందంగా మూతపడ్డాయి. వైరాలో అఖిపక్షం ఆధ్వర్యంలో హర్తాళ్ కొనసాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం: వామపక్షాల ఆధ్వర్యంలో అశ్వారావుపేటలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దుకాణాలు, పాఠశాలలు మూతపడగా పోలీసుల అండతో ఆర్టీసీ సర్వీసులు కొనసాగుతున్నాయి. కాగా, పినపాక నియోజవర్గంలో వామపక్షాలు చేపట్టిన బంద్ పాక్షికంగానే కొనసాగుతోంది. మరిన్ని జిల్లాలకు సంబంధించిన సమాచారం అందాల్సివుంది. -
గుంటూరులో హర్తాళ్‌కు మంచి స్పందన
-
విజయవాడ నగరంలో హర్తాళ్ ఎఫెక్ట్
-
YSR జిల్లాలో కొనసాగుతున్న హర్తాళ్
-
తిరుపతిలో వైఎస్సార్సీపీ హర్తాళ్
-
28న హర్తాళ్.. విజయవంతానికి పిలుపు
500, 1000 నోట్ల రద్దు ఫలితంగా సామన్యులకు కలుగుతున్న కష్టనష్టాలపై కేంద్రం మీద ఒత్తిడి పెంచేందుకు ఈనెల 28న జరిగే హర్తాళ్‌ను విజయవంతం చేయాల్సిందిగా వైఎస్ఆర్ సీపీ పిలుపునిస్తోందని పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఈ విషయమై ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ''దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు, ప్రాంతీయపార్టీలు చేస్తున్న నిరసనలకు తన పూర్తి మద్దతు పలుకుతోంది. స్వచ్ఛందంగా దుకాణాలు, వాణిజ్య, విద్యాసంస్థలు, రవాణా స్తంభించేలా రెండు రాష్ట్రాల ప్రజలు ఈ హర్తాళ్‌లో పాల్గొని ప్రజావాణిని వినిపించాల్సిందిగా కోరుతోంది. 18 రోజులుగా ఓపిక పట్టినా ఫలితం లేదు. చర్యలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని సమాధానపరిచే చర్యలు ఉంటాయని మేమంతా ఆశించాం. అలంటి చర్యలు లేకపోగా సామాన్యులను మరింత కష్టపెట్టేలా మొన్ననే మరిన్ని బిగింపులు ప్రకటించింది. పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి మారింది. ప్రజల కష్టాలను అధికారంలో ఉన్నవాళ్లకు గట్టిగా చెప్పడానికి రెండు రాష్ట్రాలలో ప్రజలంతా ఈనెల 28న నిరసనలలో పాల్గొనాలని వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తోంది. 500, 1000 నోట్లను రద్దుచేయడం ద్వారా నల్లధనాన్ని, నకిలీధనాన్ని, ఉగ్రవాద మూలాలను తుదముట్టించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్ఆర్సీపీ వెనువెంటనే స్వాగతించింది, ఇప్పటికీ సమర్థిస్తూనే ఉంది. అయితే నిర్ణయం ప్రకటించిన తర్వాత ఆ ఫలితం వలన సామాన్యులకు కష్టం, నష్టం కలగకుండా ఎలాంటి చర్యలూ తీసుకోనందున గత 18 రోజులుగా యావత్ దేశం తల్లడిల్లిపోతోంది. ప్రధానంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు పడుతున్న కష్టనష్టాలు వర్ణనాతీతం ఫలితంగా కుచేలులు బలి అవుతున్నారని అర్థమవుతుంది. ఇదే విషయాన్ని మా పార్టీ నవంబర్ 9 నుంచి స్పష్టం చేస్తోంది ప్రజల కష్టాలను వివరిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజమండ్రిలో విలేకరుల సమావేశం ద్వారా, ఈనెల 23న ప్రధాని మోదీకి లేఖ రాయడం ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తీకరించారు. తర్వాత పరిణామాలు చూస్తే ఎక్కడా కరెన్సీ లభించడంలేదు, బ్యాంకులు, ఏటీఎంలలో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి, ఏటీఎంలు పూర్తిగా మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజల కష్టనష్టాలు, మనోభావాలను ఎత్తిచూపేందుకు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 28వ తేదీన దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు తలపెట్టిన హర్తాళ్, ఆందోళనలు, నిరసనలకు వైఎస్ఆర్సీపీ మద్దతు పలుకుతోంది. పార్టీ శ్రేణులు, ప్రజలు ఈ పోరాటంలో సంపూర్ణంగా భాగస్వాములు కావాలని అధికారికంగా వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తోంది'' అని భూమన కరుణాకరరెడ్డి అన్నారు. -
కేరళలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
తిరువనంతపురం: రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎల్డీఎఫ్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలతో కేరళ అట్టుడుకుతోంది. కేరళ రాజధాని తిరువనంతపురం శనివారం నిర్మానుష్యంగా మారింది. కెఎస్ ఆర్టీసీ బస్సులను ఎక్కడిక్కడ నిలిపి వేశారు. కోలం తదితర ఏరియాల్లో బస్సులపై రాళ్లు రువ్విన ఘటనలో ఓ బస్సు డ్రైవర్ గాయపడ్డాడు. మరోవైపు వైద్య సేవలు కూడా స్థంభించాయి. కొచ్చి, ఖాజీకోడ్ తదితర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమిళనాడునుండి వస్తున్న ఒక ప్రయివేటు వాహనం, విద్యార్థులతో వెళుతున్న ఓ టూరిస్టు వాహనం పై రాళ్లు రువ్వినట్టు తెలుస్తోంది. భద్రతా దళాలు, పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అధికార, విపక్ష సభ్యుల అనుచిత ప్రవర్తనతో కేరళ గత రెండురోజులు అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ఎవరికి వారు సయమనం పాటించకుండా విధ్వంసం సృష్టించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో అస్వస్థతకు గురైన పలువురు సభ్యులు ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చివరికి భద్రతా సిబ్బంది రంగంలోకి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. దీనికి నిరసనగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్టు ఎల్డీ ఎఫ్ ప్రకటించింది. ఇది ఇలా ఉంటే.. ప్రతిపక్షాల వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి ఊమెను చాందీ సోమవారం బ్లాక్ డేగా పాటిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.