రక్షిత మంచినీరు, అందరికి గూడు, మరుగుదొడ్ల నిర్మాణం, రైతులకు రుణాల పంపిణీ, బాలల సంరక్షణకు పలు పథకాలు,
రాయచూరు : రక్షిత మంచినీరు, అందరికి గూడు, మరుగుదొడ్ల నిర్మాణం, రైతులకు రుణాల పంపిణీ, బాలల సంరక్షణకు పలు పథకాలు, పేదలకు మేలు చేస్తున్న సబ్సిడీలను ఆపే ప్రసక్తే లేదంటూ శనివారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జెట్లీ 2015-16 గాను ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై జిల్లా ప్రజలు మిశ్రమ ప్రతిస్పందన తెలిపారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు మట్లాడుతూ సురక్షత మంచినీరు, రైతులకు రుణాలు, నిరాశ్రయులకు ఇళ్లు, సబ్సిడీలపై కోత విధించనన్న హామీ తదితర అంశాలు జిల్లా ప్రజలకు ఎంతో నచ్చాయన్నారు.
చిన్ననీటిపారుదల, కుటీర పరిశ్రమలు ముఖ్యంగా రైతులకు రూ.8.5 లక్ష కోట్ల రుణాల మంజూరు, కేంద్రం నుంచి రాష్ట్రాలకు రూ.5.4 లక్ష కోట్లు, స్వచ్చ భారత్ పథకం ద్వారా ఆరు కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం తదితరాల ప్రయోజనాన్ని పొందేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.