► అరవకురిచ్చిల హోరాహోరీ
► దళపతికి మద్దతు జోరు
► సర్వేతో వెలుగు
► {పచారం ముమ్మరం
► తనిఖీల్లో పట్టుబడుతున్న కరెన్సీ
రాష్ట్రంతో పాటు పుదుచ్చేరిలో జరగనున్న ఉపఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్‌లకు తలా ఓ స్థానంలో గెలుపు ఖాయం అన్నది తేలింది. ఇందుకు తగ్గట్టుగా లయోలా విద్యార్థుల సర్వేలో స్పష్టమైంది. అరవకురిచ్చిలో
మాత్రం ఇద్దరి మధ్య సమరం హోరాహోరీగా మారింది. ఈ సర్వే నేపథ్యంలో ఆయా స్థానాల్లో అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ సుడిగాలి పర్యటన సాగించే పనిలో పడ్డారు.
సాక్షి, చెన్నై : తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పర గుండ్రంలతో పాటు పుదుచ్చేరిలోని నెల్లితోప్పు స్థానానికి ఉపఎన్నిక 19వ తేదీ జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల తేదీ సమీపిస్తుం డడంతో ఓట్ల వేటలో అభ్యర్థులు, వారి మద్దతు దారులు దూసుకెళుతున్నారు. డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టారు. అరవకురిచ్చిలో శనివారం విసృ్తతంగా పర్యటించారు. ఆదివారం పుదుచ్చేరిలో ఆయన పర్యటన సాగనుంది. తన పర్యటనలో తాజాగా, అన్నాడీఎంకే సర్కారు పాలనను ఎత్తి చూపుతూ, ఆరు నెలల ఆ ప్రభుత్వ తీరుకు ప్రజలు ఇచ్చే తీర్పుగా ఈ ఎన్నికలు నిలవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ విసృ్తతంగా పర్యటించే పనిలో పడ్డారు. కాసేపు ఓపెన్ టాప్ వాహనంలో, మరి కాసేపు నడకతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు.
ఇక, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్, డీఎండీకే అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత విజయకాంత్, పీఎంకే అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ యువజన నేత, ఎంపీ అన్భుమణి రాందాసు, ఆ పార్టీ అధ్యక్షుడు జీకే మణి వేర్వేరుగా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. పుదుచ్చేరిలో సీఎం జయలలిత గళాన్ని అనుకరిస్తూ, ఐరన్(ఉక్కు) అనే కార్యకర్త ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండడం ఆ పార్టీ అభ్యర్థి ఓం శక్తి శేఖర్‌కు కొంత మేరకు ఊరటే. ప్రచారం హోరెత్తి ఉండడంతో, ఆయా నియోజకవర్గాల్లో తనిఖీలు ముమ్మరం అయ్యారుు.
అరవకురిచ్చిలో జరిపిన తనిఖీల్లో ఓ మినీ వ్యాన్‌లో రూ. 34.75 లక్షలు, మరో చోట రూ. 11 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అరుుతే, రూ. 34. 75 లక్షలు రామనాథపురానికి చెందిన ధాన్యం వ్యాపారికి చెందినట్టు గుర్తించారు. లెక్కలు లేని దృష్ట్యా, ఆ నగదును సీజ్ చేశారు. కాగా, ఈ నోట్లన్నీ తాజాగా కాలం చెల్లినట్టు ప్రకటించినవే.
గ్యారంటీ : ఉప ఎన్నికల్లో ఓట్ల వేట జోరందుకుని ఉంటే, లయోల విద్యార్థులు 874 మంది ఆయా నియోజకవర్గాల్లో సర్వే సాగించి ఉన్నారు. ఈ వివరాలను శనివారం ప్రకటించారు. తంజావూరు నియోజకవర్గాన్ని డీఎంకే కై వసం చేసుకునేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్టు ఆ సర్వే మేరకు తేల్చారు. తిరుప్పరగుండ్రం అన్నాడీఎంకే ఖాతాల పడడం ఖాయం అని, ఇక్కడ కేవలం శీనివేల్ మరణం కారణంగా సానుభూతి ఓట్లు అభ్యర్థికి కలివచ్చే అంశంగా తేలింది. ఇక, అరవకురిచ్చిలో డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులకు మధ్య సమరం హోరా హోరీగా సాగుతున్నట్టు, గెలుపు ఎవరి పక్షమో అన్నది తేల్చ లేని పరిస్థి తి నెలకొన్నట్టు ప్రకటించడం గమనార్హం.
ఇక, గత అన్నాడీఎంకే పాలన అద్భుతం అని, కొన్నాళ్ల పాటుగా సాగిన పన్నీరు సెల్వం రూపంలో కొంత మచ్చ తప్పలేదని పాలనా పరంగా సంధించిన ప్రశ్నకు సమాధానాలు వచ్చారుు. తాజాగా, అరుుతే, పాలన మరీ అధ్వానంగా తయారై ఉన్నట్టు మెజారిటీ శాతం స్పష్టం చేశారు. 65 శాతం మంది పాలనకు వ్యతిరేకంగా, 21 శాతం మద్దతుగా తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేసి ఉన్నారు. ఇక, పుదుచ్చేరి నెల్లితోపు నియోజకవర్గాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణస్వామి కై వసం చేసుకుంటారని ప్రకటించారు.
దళపతికి మద్దతు: రాష్ట్రంలో సీఎం జయలలిత ఆసుపత్రిలో ఉన్న దృష్ట్యా, రాష్ట్రంలో ప్రజాదరణ, ప్రజల పక్షాన నిలబడి ముందుకు సాగుతున్న నేతల్లో డీఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్‌కు మద్దతు పలికిన వారే ఎక్కువ. ఆయన ప్రజా పయనానికి 79.9 శాతం మంది మద్దతు ఇచ్చి ఉండడం విశేషం. తదుపరి జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్, డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత , తమిళమానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్‌లకు మద్దుతగా ఓట్లు రావడం గమనార్హం. కాగా, రాష్ట్రంలో అవినీతి పేరుకు పోరుు ఉన్న శాఖలుగా రిజిస్ట్రేషన్, పోలీసు, ఆరోగ్యం, ప్రజా పనులు, రవాణాలు జాబితాలోకి ఎక్కారుు.
ఒకటి గ్యారంటీ!
Published Sun, Nov 13 2016 3:21 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement