పెనమలూరు: ఇంటి సరిహద్దు విషయమై వివాదం చెలరేగడంతో ఓ మహిళపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడప రామానగర్‌కు చెందిన ఎం.లలితకు ఇంటి పక్కనే ఉంటున్న పార్వతమ్మకు సరిహద్దు తగాదా ఉంది. ఈ నేపథ్యంలో శనివారం ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. లలితపై పార్వతమ్మతో పాటు సురేంద్ర అనే వ్యక్తి దాడి చేశారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.