జుహూలో రన్‌వే నిర్మాణానికి ‘పచ్చ’ జెండా | central tourism department accepted to build run way in Juhu | Sakshi
Sakshi News home page

జుహూలో రన్‌వే నిర్మాణానికి ‘పచ్చ’ జెండా

Published Sat, Nov 30 2013 4:42 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM

central tourism department accepted to build run way in Juhu

సాక్షి, ముంబై:  సముద్రంతీరంలోని జుహూ విమానాశ్రయంలో రన్‌వే నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతినిచ్చింది. సముద్రంలో ఎలాంటి మట్టి వేయకుండా 800 మీటర్ల పొడవైన రన్‌వే నిర్మించేందుకు అనుమతి లభించింది.ఈ నిర్మాణం పూర్తయితే సముద్రతీరం సమీపంలో ఉన్న జుహూ విమానాశ్రయం నుంచి త్వరలో విమనాలు రాకపోకలు సాగించనున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుతం శాంత్రాకజ్ డొమెస్టిక్ విమానాశ్రయంపై పడుతున్న ట్రాఫిక్ భారం కొంతమేర తగ్గుతుంది. కొన్ని దశాబ్దాల కిందట నగరంలో మొట్ట మొదటిసారి జుహూ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి.

కాలక్రమేణా విమానాల సంఖ్య పెరిగిపోవడంతో శాంతాక్రజ్, ఆ తరువాత అంధేరిలోని సహార్ అంతర్జాతీయ విమానాశ్రాయాలను నెలకొల్పారు. ప్రస్తుతం జుహూ నుంచి చిన్న తరహా చార్టెడ్ విమానాలు, హెలికాప్టర్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ విమానాశ్రయాన్ని జుహూ హెలిప్యాడ్‌గా పిలుస్తారు. సహార్, శాంతాక్రజ్ విమానాశ్రయాలపై పడుతున్న ట్రాఫిక్ భారాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయం అవసరమని అధికారులు ఆలోచిస్తుండగా ఎయిర్ అథారిటీ వర్గాలు జుహూ విమానాశ్రయం అనుకూలంగా ఉంటుందని భావించాయి. జుహూలో రన్‌వే ఆధునిక విమానాల రాకపోకలకు అనుకూలంగా లేదు. రన్‌వే పొడవు పెంచాలని నిపుణులు సూచించడంతో 800 మీటర్ల రన్‌వే ను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కాగా సముద్రాన్ని పూడ్చి రన్‌వే ఏర్పాటు చేయడానికి కేంద్ర పర్యావరణ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పిల్లర్లు వేసి వంతెనపై రన్‌వే ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జుహూ విమానాశ్రయానికి పూర్వ వైభవం రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement