ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి సీనియర్ ఐఏఎస్ అధికారి రమేష్ నేగీ పేరు దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తోంది.
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి సీనియర్ ఐఏఎస్ అధికారి రమేష్ నేగీ పేరు దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తోంది. 1984 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి నేగీ పేరును ప్రధాన కార్యదర్శి పదవి కోసం కేంద్ర హోమ్ శాఖ ఢిల్లీ సర్కారుకు సూచించింది. కాగా, ఈ పదవి కోసం మరో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నా కూడా నేగీ పేరు ముందు వరుసలో ఉన్నట్లు చెబుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వ వ్యవహారాల్లో అనుభవంతో పాటు నియితీపరుడనే ముద్ర నేగీపై ఉంది. గతంలో ఢిల్లీ జల్ బోర్డు సీఈఓగా, డీటీసీ మేనేజింగ్ డెరైక్టర్‌గా పనిచేసిన నేగీ, ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇదిలా ఉండగా సీఎస్ పదవి కోసం పరిశీలిస్తున్న ముగ్గురు అధికారుల పేరుల్లో నైనీ జైశ్రీలన్, సంజయ్ శ్రీవాస్తవ, ఆనంద్ ప్రకాశ్ ఉన్నట్లు సమాచారం.