చంద్రబాబు పర్యటన రద్దు.. కేసు ఎఫెక్టేనా? | chandra babu naidu rushes to vijayawada from tirupati | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పర్యటన రద్దు.. కేసు ఎఫెక్టేనా?

Published Mon, Aug 29 2016 2:03 PM | Last Updated on Mon, Jul 29 2019 7:35 PM

చంద్రబాబు పర్యటన రద్దు.. కేసు ఎఫెక్టేనా? - Sakshi

చంద్రబాబు పర్యటన రద్దు.. కేసు ఎఫెక్టేనా?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తిరుపతి పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకున్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన ఉండాల్సి ఉన్నా.. దాన్ని తక్షణం రద్దు చేసుకున్నారు. కేంద్రమంత్రి జేపీ నడ్డా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. కానీ హుటాహుటిన తంబళ్లపల్లి నుంచి హెలికాప్టర్‌లో బెంగళూరుకు ఆయన బయల్దేరారు. ఉండవల్లిలోని తన తాత్కాలిక నివాసానికి చేరుకున్న తర్వాత ఆయన న్యాయనిపుణులను సంప్రదించే అవకాశం కనిపిస్తోంది. రేపటినుంచి నాలుగు రోజుల పాటు అనంతపురం జిల్లాలో కూడా చంద్రబాబు పర్యటన కొనసాగాల్సి ఉంది గానీ, అది కూడా రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది.

బెంగళూరు నుంచి నేరుగా విమానంలో గన్నవరం చేరుకోనున్నారు. ఓటుకు కోట్లు కేసుపై పునర్విచారణ జరపాలని ఏసీబీ కోర్టు ఆదేశించిన నేపథ్యంలోనే చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దయినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టును కోరిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement