
ఓటుకు కోట్లు కేసుపై చంద్రబాబు హైరానా!
విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు కోట్లు కేసుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైరనా పడుతున్నారు. ఈ కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం అడుగులపై చంద్రబాబులో ఆందోళన మొదలయినట్టు తెలుస్తోంది. తాజా పరిణామాలపై అనంతపురం నుంచి చంద్రబాబు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.
అంతేకాక గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశంపై కూడా చంద్రబాబు సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ సమర్పించిన నివేదికలోని అంశాలపై టీడీపీ నేతల్లో ఒక్కసారిగా టెన్షన్ పట్టుకుంది. ఇంటలిజెన్స్ అధికారులు సీఎంవో అధికారుల ద్వారా సమాచారాన్ని చంద్రబాబు సేకరిస్తున్నట్టు తెలిసింది.