సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా న్యూఢిల్లీ నియోజకవర్గంలో గట్టి పోటీ ఇవ్వగలిగే అభ్యిర్థి కోసం బీజేపీ అన్వేషణ మొదలుపెట్టింది. ఇందుకోసం కిరణ్ బేడీ, వినోద్‌కుమార్ బిన్నీ, షాజియా ఇల్మీతో పాటు పలువురు నేతల పేర్లను పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆమ్ ఆద్మీ పార్టీని రానున్న విధానసభ ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థిగా పరిగణిస్తోన్న బీజేపీ నేతలు, ఈ ఎన్నికలలో ఆప్‌ను దెబ్బతీయాలంటే ఆ పార్టీ నేత అర్వింద్ కేజ్రీవాల్‌ను ఇరుకునబెట్టాలని గుర్తించింది. గట్టి అభ్యర్థిని బరిలోకి దింపడం ద్వారా కేజ్రీవాల్ తన నియోజకవర్గంపైనే ప్రధానంౄ దష్టి సారించేటట్లు చేసి నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఆయన ప్రచారాన్ని నియంత్రించాలని ఆశిస్తోంది. అందుకోసం ఆయనకు ధీటైన అభ్యర్థి కోసం గాలిస్తోంది. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా బరిలోకి దింపడానికి బిజెపి పరిశీలిస్తోందంటోన్న ముగ్గురు- వినోద్‌కుమార్ బిన్నీ , కిరణ్ బేడీ, షాజియా ఇల్మీ ఒకప్పుడు కేజ్రీవాల్‌తో పాటు సన్నిహితంగా మెలిగినవారే కావడం విశేషం. పలువురు బీజేపీ నేతలు కూడా కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా పోటీచేయడానికి ఉత్సాహం చూపుతున్నట్లు సమాచారం.
న్యూఢిల్లీ నియోజకవర్గం ఎప్పుడూ ఢిల్లీ రాజకీయాల్లో కీలకంగానే ఉంటూ వచ్చింది. మొదటి రెండు విధానసభ ఎన్నికలను వదిలిపెడ్తే ప్రతి అసెంబ్లీ ఎన్నికలోనూ ముఖ్యంగా షీలాదీక్షిత్ ఈ సీటు నుంచి పోటీచేసిన మూడు సార్లు ఇక్కడినుంచి గట్టి అభ్యర్థిని బరిలోకి దింపడానికి బీజేపీ ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో పలుమార్లు కొత్త వారికి టికెట్ ఇచ్చిన బీజేపీ, ఈ సారి కూడా కొత్తవారినే అభ్యర్థిగా నిలబెట్టవచ్చని అంటున్నారు. గత విధానసభ ఎన్నికల్లో ఢిల్లీ శాఖ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తాను బీజేపీ ఇక్కడనుంచి పోటీకి నిలబెట్టింది. ఆ ఎన్నికల్లో ఆప్ తరఫున అర్వింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ తరఫున షీలాదీక్షిత్ బరిలో ఉండగా, అర్వింద్ కే జ్రీవాల్ 25 వేల ఓట్లతో షీలాదీక్షిత్‌ను ఓడించగా, గుప్తా మూడవ స్థానంలో నిలిచారు. విధానసభ ఎన్నికలలో ఒక అభ్యర్థి ఇంత భారీ మెజారిటీతో గెలవడం అందులోనూ మూడుసార్లు ఢిల్లీని గెలిచిన షీలాదీక్షిత్‌పై విజయం సాధించడం అర్వింద్ కేజ్రీవాల్‌కు గల ప్రజాదరణను చాటి చెప్పింది.
ఈ సారి సర్వేలు కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక ల్లో బిజెపి గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎక్కువ మంది అర్వింద్ కేజ్రీవాల్‌నే కోరుతున్నారని వెల్లడించడం బీజేపీకి మింగుడుపడడం లేదు. అందుకే ఆయనకు గట్టి పోటీ ఇవ్వాలనుకుంటోంది. లోక్‌సభ ఎన్నికల్లో న్యూఢిల్లీ సీటు బీజేపీకే దక్కినా, విధానసభ ఎన్నికల్లోనూ గెలుపు తమదే అన్న ధీమాను ఆ పార్టీ వ్యక్తం చేయడంలేదు. అయితే గత విధానసభ ఎన్నికల తర్వాత న్యూఢిల్లీ ఓటర్లకు కేజ్రీవాల్ పట్ల మోజు తగ్గిందని బీజేపీ నేతలు భావిస్తున్నారు .దానికి తోడు నరేంద్ర మోదీ ప్రభంజనం ఉండనే ఉందని కాబట్టి ఈ విధానసభ ఎన్నికల్లో గతం కంటే పరిస్థితులు తమ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో బలమైన అభ్యర్థిని కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నిలబె ట్టడం ద్వారా ఆయనను దెబ్బతీయవచ్చనివారు భావిస్తున్నారు. కేజ్రీవాల్‌ను దెబ్బతీయడానికి ఒకప్పుడు ఆయనకు సన్నిహిత సహచరులుగా ఉన్నవారినే పోటీకి నిలబెడితే బాగుంటుందని వారు అంటున్నారు .ఇదిలా ఉండగా, బీజేపీ యువమోర్చా నేత సునీల్ యాదవ్, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు నుపుర్ శర్మ కూడా ఈ సీటు నుంచి పోటీచేయడానికి ఆసక్తితో ఉన్నారని అంటున్నారు.
మోదీ ర్యాలీకి ముమ్మర సన్నాహాలు
సాక్షి, న్యూఢిల్లీ: రామ్‌లీలామైదాన్‌లో శనివారం (జనవరి 10) ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్న ర్యాలీని పార్టీ గెలుపునకు సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాలని బీజేపీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ర్యాలీకి లక్ష మందికి పైగా హాజరయ్యేలా చూడడం కోసం ఢిల్లీ నలుమూలల నుంచి బస్సుల్లో జనాలను తరలించే ఏర్పాట్లు ఓ పక్క జరుగుతుండగా మరోపక్క రైల్వేస్టేషన్లు, ఐఎస్బీటీ స్టేషన్లలో కూడా మోదీ ప్రసంగాన్ని ప్రసారం చేసేందుకు ఎల్‌సీడీ స్క్రీన్లను అమరుస్తున్నారు. రామ్‌లీలామైదాన్‌లో కూడా 14 ఎల్‌సీడీ స్క్రీన్లు అమర్చారు. మోదీ చేసే ప్రకటనలు, హామీలను వెంటనే ట్విటర్‌పై ఉంచుతారు. ఇందుకోసం ఒక ప్రత్యేకృబందం సిద్ధంగా ఉంటుంది.
‘ఆమ్‌ఆద్మీ’ని ఎదుర్కొనేదెలా..
Published Thu, Jan 8 2015 11:08 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement
Advertisement