అబద్ధాలు చెప్పడంలో సీఎం నెంబర్ వన్!
అబద్ధాలు చెప్పడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నెంబర్ వన్ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఏమాత్రం సంతోషంగా లేరన్నారు.
రెండు గ్రామాల్లో 500 డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించడానికి అయిన ఖర్చు కంటే, దాన్ని ప్రచారం చేసుకోడానికి ఎక్కువ ఖర్చు చేశారని వీరభద్రం మండిపడ్డారు. ఉపాధి హామీ కూలీల డబ్బులను కూడా వాడుకున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎన్నికల హామీలను ఉల్లంఘిస్తే ప్రజాక్షేత్రంలో ఎండగడతామని ఆయన హెచ్చరించారు.