పోలీసులకు పట్టుబడిన సినీ డాన్సర్లు
Published Mon, Dec 9 2013 3:01 AM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM
తమిళసినిమా, న్యూస్‌లైన్: ఆడంబరమైన అద్దె బంగ్లాలో వ్యభిచారం చేస్తున్న నలుగురు సినీ డాన్సర్లను పోలీసులు అరెస్టు చేశారు. కోవై కౌండం పాళయంలోని ఒక బంగ్లాలో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో తుడియలూరు పోలీసు ఇన్‌స్పెక్టర్ కనకసుందరం, సబ్‌ఇన్‌స్పెక్టర్లు రాజేంద్రప్రసాద్, కనిమొళి, భాగ్యలక్ష్మి, సిబ్బంది ఆదివారం కౌండం పాళయం చేరుకున్నారు. వ్యభిచారం జరుగుతున్న బంగ్లాను పోలీసులు చుట్టుముట్టారు.
అక్కడ వ్యభిచారం చేస్తున్న నలుగురు సినీ డాన్సర్లతో పాటు ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో ముంబయికి చెంది న నిషా(20), చెన్నైకి చెందిన మాలా (22) అని తెలి సింది. రోహిణి (19), శాంతి (22) అని తెలిసింది. వీరిద్దరూ సహాయ నటీమణులని తెలిసింది. రోహిణి, శాంతి సినీడాన్సర్లని తెలిసింది. వీరందరూ మూడు రోజుల క్రితం కౌండం పాళయంకు వచ్చి వ్యభిచారం సాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరి నుంచి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
Advertisement
Advertisement