ముంబై: ముంబైకు చెందిన ఓ టీవీ నటిని వేధించిన కేసులో ఓ కాలేజీ విద్యార్థిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన స్వప్నిల్ సహారే (23) అనే యువకుడు ఇంటర్నెట్‌లో టీవీ నటి ఫోన్ నెంబర్ చూశాడు. ఆ తర్వాత స్వప్నిల్ వాట్సప్ ద్వారా ఆమెకు అభ్యంతరకర మెసేజ్‌లు పంపేవాడు.
అతని చర్యలతో విసిగిపోయిన బాధిత నటి కురర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మొబైల్ నెంబర్ ఆధారంగా నిందితుడ్ని గుర్తించి గడ్చిరోలి జిల్లాలోని అతని ఇంట్లో అరెస్ట్ చేశారు. స్థానిక కోర్టులో స్వప్నిల్‌ను హాజరు పరచగా, శనివారం వరకు పోలీస్ కస్టడీకి అప్పగించింది. బాధిత టీవీ నటి పేరును పోలీసులు వెల్లడించలేదు.
ఇంటర్నెట్‌లో నటి ఫోన్ నెంబర్ చూసి..
Published Fri, Apr 28 2017 7:14 PM | Last Updated on Fri, Nov 9 2018 5:06 PM
Advertisement
Advertisement