
ప్రియురాలికి పెళ్లైందని ఆత్మహత్యాయత్నం
ప్రియురాలికి వేరే వ్యక్తితో వివాహం జరగడాన్ని తట్టుకోలేక యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆంబూరు సమీపంలో చోటుచేసుకుంది.
వేలూరు: ప్రియురాలికి వేరే వ్యక్తితో వివాహం జరగడాన్ని తట్టుకోలేక యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆంబూరు సమీపంలో చోటుచేసుకుంది. వేలూరు జిల్లా ఆంబూరు సమీపంలోని పుదు గోవిందాపురానికి చెందిన ముత్తు కుమారుడు శరత్‌కుమార్(23) ఆటో డ్రైవర్. ఇతను అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించి 2014లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ యువతికి 15 సంవత్సరాలు మాత్రమే ఉండడంతో పెళ్లి చెల్లదని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇరువురిని అదుపులోకి తీసుకుని నచ్చజెప్పి పంపారు.
ఇదిలా ఉండగా యువతికి మరో వ్యక్తితో వివాహం జరుగుతున్నట్లు శరత్‌కుమార్‌కు తెలిసింది. ఈ విషయమై ఇతను ఆంబూరు పోలీసులకు పిర్యాదు చేశాడు. పోలీసులు ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో డీఎస్పీకి ద గ్గరికి వెళ్లాడు. అక్కడ కూడా ఇతని ఫిర్యాదును స్వీకరించలేదని తెలిసింది. కాగా తమపైనే ఫిర్యాదు చేయడానికి వెళ్లాడని ఆగ్రహించిన యువతి బంధువులు శరత్‌కుమార్ ఆటోను, అతని ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో తీవ్ర మన స్తాపానికి గురైన శరత్‌కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చుట్టు పక్కల వారు గుర్తించి బాధితుడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.