'సెంట్రల్‌ పార్క్ ప్రైవేటీకరిస్తే ఉద్యమమే' | communist leaders warning over central park privatization in vizag | Sakshi
Sakshi News home page

'సెంట్రల్‌ పార్క్ ప్రైవేటీకరిస్తే ఉద్యమమే'

Published Thu, Sep 22 2016 10:22 AM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

'సెంట్రల్‌ పార్క్ ప్రైవేటీకరిస్తే ఉద్యమమే'

'సెంట్రల్‌ పార్క్ ప్రైవేటీకరిస్తే ఉద్యమమే'

ద్వారకానగర్‌ : వుడా సెంట్రల్‌ పార్కును ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదని వామపక్ష నాయకులు స్టాలిన్, గంగారావు హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం పార్కు ఎదుట సీపీఎం, సీపీఐ నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ప్రజాసంఘాలు, వామపక్షాల పోరాటంతోనే ఖాళీగా ఉన్న పాత జైలు స్థలం సెంట్రల్‌ పార్కుగా రూపుదిద్దుకుందన్నారు. ఇప్పుడు వుడా నిర్వహణ భారం నెపంతో పార్కును ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు కొనసాగిస్తుందని, దీనిని విరమించుకోకపోతే ప్రజా ఉద్యమం చేపడతామన్నారు.

ముఖ్యమంత్రి ప్రారంభించి వారం రోజులు కూడా కాకుండానే ప్రైవేట్‌పరం చేసి రూ.400 టికెట్టు పెట్టి దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. మంత్రులు గంటా, నారాయణ కలిసి నగరంలోని విలువైన భూములను ఏ విధంగా కాజేయాలనే లక్ష్యంతో ఉన్నారని విమర్శించారు. జగదాంబ సెంటర్‌లో గ్రంథాలయం ఏర్పాటు కోసం కేటాయించిన స్థలాన్ని మంత్రి గంటా ప్రత్యూష కంపెనీ పేరు మీద తీసుకుని వివాదంలో పెట్టారని ధ్వజమెత్తారు. ఇలాంటి మంత్రి మనకు ఉన్నారని చెప్పుకోవడం సిగ్గుచేటు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు మార్కండేయులు, ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్, పైడిరాజు, విమల తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement