సాక్షి, చెన్నై :
అధికారం లక్ష్యంగా తీవ్ర వ్యూహ రచనలతో డీఎంకే ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. మైనారిటీ పార్టీల్ని అక్కున చేర్చుకుని, వివిధ సామాజిక వర్గాల సంఘాలు, పార్టీల మద్దతు , వారికి సంఖ్యా బలం ఆధారంగా సీట్ల కేటాయింపుల్లో డీఎంకే అధినేత కరుణానిధి, దళపతి, కోశాధికారి ఎంకే స్టాలిన్ బిజీబిజీగా ఉన్నారు. అయితే, కూటమిలోకి తొలుత అడు గు పెట్టిన కాంగ్రెస్ సీట్ల పందేరం మాత్రం ఇంత వరకు కొలిక్కి తీసుకురాలేదు. డీఎంకే తో సాగించిన మంతనాల మేరకు ఢిల్లీలో అధినేత ఆమోదం కోసం టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ తిష్ట వేసి ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో ఈ వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేం దుకు కరుణానిధి సిద్ధం అయ్యారు. గురువా రం ఉదయం గోపాలపురానికు దళపతి స్టాలి న్, గారాల పట్టి,మహిళా నేత, ఎంపీ కనిమొళిలతో పాటుగా ముఖ్య నాయకులు దురై మురుగన్, పొన్ముడి, ఏవీ వేలు, కేఎన్ నెహ్రు, పూండి కలై వానన్‌లతో సమావేశమయ్యారు. సుమారు రెండు గంటల పాటుగా ఈ సమావేశం కాంగ్రెస్‌కు సీట్ల కేటాయింపు మీదే సాగి నట్టు సమాచారం. సీట్ల పందేరాన్ని త్వరితగతిన ముగించి, అభ్యర్థుల ప్రకటన, ప్రచార బరిలోకి దూసుకెళ్లేందుకు తగ్గ కార్యాచరణను వేగవంతం చేయడానికి ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకుని ఉన్నారు.
అదే సమయంలో సీట్ల పందేరం తేలని దృష్ట్యా, కాంగ్రెస్‌ను పక్కన పెట్టి, తమిళ మానిల కాంగ్రెస్‌ను అక్కున చేర్చుకునేందుకు డిఎంకే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వస్తున్న సమాచారాలకు ఈసందర్భంగా స్టాలిన్ ముగింపు పలికారు. సమావేశానంతరం వెలుపలకు వచ్చిన స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. తమిళ మానిల కాంగ్రెస్‌తో చర్చల్లో ఉన్నట్టుందే..? అని ప్రశ్నించగా, ఎవరు చెప్పారు..? నేను చెప్పానా..? తమ వాళ్లెవరైనా చెప్పారా..? అని ఎదురు ప్రశ్న వేశారు. తమిళ మానిల కాంగ్రెస్‌తో ఎలాంటి చర్చలు జరపలేదని, జరపబోమని వ్యాఖ్యానించారు.
ఊహా జనిత కథనాలకు, ప్రచారాలకు తనను సమాధానం అడగడం మానుకోవాలని, వాటన్నింటికీ తానెలా బాధ్యుడు అవుతానంటూ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌తో సీట్ల పందేరం కొలిక్కివచ్చిందా..?అ ని ప్రశ్నించగా, వచ్చాక పిలిచి చెబుతానంటూ ముందుకు సాగారు. ప్రచార రథంలో చక్కర్లు : అధికారం లక్ష్యంగా ముందుకు సాగుతున్న డిఎంకే అధినేత కరుణానిధి ఈ సారి రాష్ర్ట వ్యాప్తంగా పర్యటించేందుకు నిర్ణయించి ఉన్నారు. ఆయన వయోభారాన్ని పరిగణలోకి తీసుకుని ప్రత్యేక ప్రచార రథాన్ని సిద్ధం చేసి ఉన్నారు.
వీల్ చైర్‌కు పరిమితంగా ఉన్న కరుణానిధి నేరుగా ఆ రథంలోకి వెళ్లేందుకు తగ్గ ప్రత్యేక ఏర్పాట్లు, ఆయన విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక సదుపాయాలు, సమాచారాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా అత్యాధునిక హంగులు, నలు వైపులా ప్రత్యేక విద్యుత్ లైట్లు, స్పీకర్లు, ఇలా ప్రత్యేక సౌకర్యాలతో తీర్చిదిద్దిన ఈ వాహనం చెన్నైకు బుధవారం సాయంత్రం చేరింది. ఈ వాహనం రాగానే, అందులో కాసేపు కరుణానిధి, స్టాలి న్ చక్కర్లు కొట్టడం విశేషం. తనకు ఆ వాహ నం అన్ని విధాలుగా సౌకర్యంగా ఉందా..? అని పరిశీలించేందుకు తగ్గట్టుగా ఈ ట్రైల్ నగరంలో సాగడంతో కరుణానిధి చూడటానికి పార్టీవర్గాలు, అభిమానులు రోడ్డెక్కారు. ట్రాఫిక్‌ను ఎక్కడా నిలపకుండా జనంతో జనంగా అన్ని వాహనాలతో కలిసి కరుణానిధి రథం నగరంలో కొన్ని చోట్ల సాగింది.