న్యూఢిల్లీ: వైద్యరంగాన్ని అవినీతి జబ్బు పట్టిపీడిస్తోంది. దీనివల్ల వేలాది కుటుంబాలు రోడ్డునపడుతున్నా పట్టించుకునే నాథుడే ఉండటం లేదు. వైద్యుడి చిన్నపాటి నిర్లక్ష్యానికి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా సరైన రీతిలో స్పందించే యంత్రాం గం లేకపోవడంతో సామాన్యులు బలి అయిపోతున్నారు. ఢిల్లీ నగరంలో ఈ జాడ్యం మరింత ఎక్కువగా అల్లుకుపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నా రు. అవినీతి నిరోధానికి హామీ ఇచ్చిన ఆప్ ప్రభుత్వం గత బుధవారం హెల్ప్‌లైన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. వైద్యరంగంలోనూ పేరుకుపోయిన అవినీతిని నిర్మూలించేందుకు ఇప్పటినుంచే కృషిచేయాలని ఆ రంగ బాధితులు కోరుతున్నారు.
తమ డిమాండ్‌తో ప్రభుత్వాన్ని ఆకర్షించేందుకు బాధితులు ‘పీపుల్ ఫర్ బెటర్ ట్రీట్‌మెంట్(పీబీటీ)’ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహిం చారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మీడియతో మాట్లాడుతూ వైద్యరంగ నిర్లక్ష్యం వల్ల తాము ఎలా నష్టపోయామో తెలిపారు. పొరోమా రెబెల్లో అనే మహిళ మాట్లాడుతూ..‘ మూడేళ్ల కిందట నా తండ్రి(84)ని స్వల్ప విషాహార సమస్యతో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చాం. అక్కడ వారు ఆరు రోజుల పాటు ఉంచుకుని మరో ఆస్పత్రికి పం పించారు.
ఆ సమయంలో వారు నా తండ్రికి కనీ సం యాంటీబయోటిక్స్ కూడా ఇవ్వలేదు. మరో ఆస్పత్రికి వెళ్లిన తర్వాత ఆయన మృతిచెందాడు..ఈ విషయమై నేను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ)కు ఫిర్యాదు చేశా..’ అని ఆమె చెప్పా రు. కాగా వైద్యరంగంలో అవినీతిపై తగిన చర్యలు తీసుకోవాలని పీబీటీ సభ్యులు ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ను కలిసి విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారు..’ అని ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా, మీనాక్షి జైన్ అనే మహిళ స్పం దిస్తూ ‘ మూడేళ్ల కిందట నా తండ్రి చనిపోయాడు. అతడి మృతికి సంబంధించిన నివేదికల కోసం నేను అటు పోలీసులతో, ఇటు వైద్యశాఖతో పోరాటం చేస్తున్నాను.
రాష్ట్ర వైద్యపరిషత్ నిబంధనల ప్రకారం ఒక రోగి చనిపోతే అతడికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్‌ను 72 గంటల్లోగా సంబంధీకులకు అందజేయాలి. అయితే మూడేళ్లయినా మాకు ఆ రిపోర్టులు ఇవ్వడంలేదు. వాటి కోసం ఇప్పటికీ పోరాడాల్సి వస్తోంది..’ అని ఆమె చెప్పా రు. ‘పోలీసులు, వైద్యు ల మధ్య ఉన్న సంబంధాల వల్ల రోగుల కుటుంబాలకు న్యాయం జరగడంలేదు..’ అని న్యాయవాది కూడా అయిన జైన్ ఆరోపించారు.
ఆప్ ప్రభుత్వం దీనిపై ఇప్పటి నుంచే దృష్టిపెడితే వైద్య రంగం వల్ల నష్టపోయే వారి సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి..’ అని వైద్యుల నిర్లక్ష్యానికి బలైన జస్టిస్ జె.ఎస్.వర్మ కుమార్తె శుభ్ర వర్మ వ్యాఖ్యానించారు. ఆమె మాట్లాడుతూ..‘ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులకే వైద్యరంగంపై పోరాటం కష్టంగా ఉంది. అటువంటిది ఈ రంగంతో సామాన్యులు పోరాటం చేయ డం అసాధ్యమే..’ అని స్పష్టం చేశారు.‘ నా తండ్రి హృద్రోగి. ఆస్పత్రికి తీసుకుపోతే ఎటువంటి పరీక్ష లు చేయకుండా రక్తం పలచబడేందుకు మం దు ఇచ్చారు. దాంతో ఆయన మృత్యువాత పడ్డారు..’ అని ఆమె ఆరోపించారు.
ఇందులో పోలీసులు, వైద్యులనే కాదు.. ఆస్పత్రులు, మందులు కంపెనీలు, రోగ నిర్ధారణ కేంద్రా లు సైతం దోషులేనని ఆమె విమర్శించారు. ‘ఒక వేళ ఆప్ ప్రభుత్వం వైద్యరంగంలో అవినీతిని అంతమొందించాలనుకుంటే.. మొదటిగా ఢిల్లీ మెడికల్ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలి..’ అని ఆమె నొక్కి చెప్పారు. ‘నా పదేళ్ల కుమారుడికి మూడు నెలల కాల వ్యవధిలో రెండుసార్లు కాలేయ మార్పిడి ఆపరేషన్ జరిగింది.
అతడిని ఒంటరిగా ఉంచకుండా, రోగగ్రస్తుల తో పాటు ఉంచారు..’ అని అరోరా అనే మహిళ రోదిస్తూ తెలిపింది. కాగా పీబీటీ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు కునాల్ సాహా మాట్లాడుతూ..‘ వైద్యరంగ వ్యవస్థ పనితీరులో పారదర్శకతను సాధించగలిగితే సామాన్యులకు న్యాయం జరుగుతుంది. ఆప్ ప్రభుత్వం ఆ దిశలో పావులు కదుపుతుందని ఆశిస్తున్నాం..’ అని అన్నా రు. అతడు తన భార్య మృతి కేసులో 16 ఏళ్లపాటు వైద్య వ్యవస్థపై పోరా టం చేశారు. చివరకు గత ఏడాది అతడికి వడ్డీతో సహా రూ.11 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీన్ని వైద్యరంగంలో ఎక్కువ మొత్తం పొందిన నష్టపరిహారం కేసుగా పరిగణిస్తున్నారు.
వైద్యానికి ‘అవినీతి’ జాడ్యం
Published Fri, Jan 10 2014 11:35 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement