కౌంటింగ్‌కు చురుగ్గా ఏర్పా ట్లు చేస్తున్నట్లు వివరించిన కలెక్టర్ వీరరాఘవరావు ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేయాలని అధికారులను ఆదేశించారు.
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: కౌంటింగ్‌కు చురుగ్గా ఏర్పా ట్లు చేస్తున్నట్లు వివరించిన కలెక్టర్ వీరరాఘవరావు ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేయాలని అధికారులను ఆదేశించారు. తిరువళ్లూరు పార్లమెంట్ స్థానానికి ఏప్రిల్ 24న ఏన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు ఉపయోగించిన ఈవీఎంలను తిరువళ్లూరు సమీపంలోని శ్రీరామ్ ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపరిచి మూడెంచల భద్రత ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 16 శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కౌటింగ్‌కు సంబందించిన ఏర్పాట్లను కలెక్టర్ వీరరాఘవరావు పరిశీలించారు. ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మీడియా రూమ్‌ను ఆయన పరిశీలించారు. కంప్యూటర్ ఇతర సౌకర్యాలను కల్పించాలని ఆయన ఆదేశించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. పలువురు అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.