వానర ప్రేమ | macaque monkey died in Collector's Office | Sakshi
Sakshi News home page

వానర ప్రేమ

Published Mon, Nov 28 2016 10:59 PM | Last Updated on Thu, Mar 21 2019 8:16 PM

వానర ప్రేమ - Sakshi

వానర ప్రేమ

తిరువళ్లూరు: అమ్మ ప్రేమకు మించి ఏదీ లేదన్నది వాస్తవం. చనిపోయిన తన పిల్లను ఎత్తుకుని రెండు రోజుల నుంచి ఓ వానరం తిరువళ్లూరు కలెక్టర్ కార్యాలయ ఆవరణలో తిరుగుతున్న వైనం అందరినీ కలిచి వేస్తోంది. ఈ ఘటన తల్లీబిడ్డలకు మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీకగా నిలుస్తోంది. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెండు రోజుల క్రితం చిన్న వానరం రెండుతస్తుల భవనంపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందింది. నిర్జీవంగా పడి ఉన్న చిన్న వానరం శరీరాన్ని తనతోపాటు ఉంచుకుని తిరుగుతూనే ఉంది.
 
  పది నిమిషాలు అటుఇటూ తిరిగిన తరువాత మృతి చెందిన వానరాన్ని లేపడానికి తల్లి కోతి చేయని ప్రయత్నం లేదు. ఎంత ప్రయత్నించినా నిర్జీవంగా ఉన్న చిన్న వానరంలో చలనం లేకపోవడంతో తల్లికోతి తల్లడిల్లిపోతోంది. ఈ సంఘటన కలెక్టర్ కార్యాలయానికి వచ్చే వారి కంట తడి పెట్టించింది. రెండు రోజులైనా తల్లి వానరం తన బిడ్డ లేస్తుందన్న నమ్మకంతో చేయని ప్రయత్నం లేదు. బహుశా తల్లి వానరానికి తెలియదేమో తన బిడ్డ చనిపోయిందని.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement