
కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
బళ్లారి ఉప ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లాధికారి సమీర్‌శుక్లా పేర్కొన్నారు. ఆయన శనివారం నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో విలేకరులతో మాట్లాడారు.
- మధ్యాహ్నానికి ఫలితాల వెల్లడి
- బళ్లారి జిల్లాధికారి సమీర్‌శుక్లా
సాక్షి, బళ్లారి : బళ్లారి ఉప ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లాధికారి సమీర్‌శుక్లా పేర్కొన్నారు. ఆయన శనివారం నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 25న పాలిటెక్నిక్ కళాశాలలో జరుగనున్న కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. బళ్లారి గ్రామీణ నియోజకవర్గ పరిధిలో 1,88,307 మంది ఓటర్లుండగా, 1,38,034 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు.
ఈ నేపథ్యంలో 14 రౌండ్లలో కౌంటింగ్‌ను పూర్తి చేస్తామన్నారు. ఉదయం 7.30 గంటలకు అన్ని రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూంలను తెరుస్తామన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తామన్నారు.
ఓట్ల లెక్కింపునకు హాజరయ్యే వారికి ఎన్నికల అధికారి నుంచి పాస్‌లు జారీ చేశామని, వారు మాత్రమే హాజరు కావాలన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు కౌంటింగ్‌ను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. అభ్యర్థితోపాటు పాస్‌లు జారీ చేసిన వారు మాత్రమే రావాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలకు అనుమతి ఉండదన్నారు.
పాలిటెక్నిక్ కళాశాల వద్ద గట్టి బందోబస్తు : ఏఎస్‌పీ సీకే బాబా
బళ్లారి గ్రామీణ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ జరిగే పాలిటెక్నిక్ కళాశాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఏఎస్‌పీ సీకే బాబా తెలిపారు. ఆయన శనివారం జిల్లాధికారితోపాటు విలేకరులతో మాట్లాడారు. ఇద్దరు డీఎస్‌పీలు, ఐదుగురు సీఐలు, 15 మంది ఎస్‌ఐలు, 20 మంది ఎస్‌ఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుల్స్ 40 మంది, 70 మంది పోలీసులు, డీఏఆర్ అధికారులు, సిబ్బంది, కేఎస్‌ఆర్‌పీ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.