విలువల్లేని పార్టీలను ఆదరించొద్దు | cpm state president commented to othter parties | Sakshi
Sakshi News home page

విలువల్లేని పార్టీలను ఆదరించొద్దు

Published Wed, Feb 10 2016 3:26 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

విలువల్లేని పార్టీలను ఆదరించొద్దు - Sakshi

విలువల్లేని పార్టీలను ఆదరించొద్దు

సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.జి.వి.శ్రీరామరెడ్డి
 
 గౌరిబిదనూరు : కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు నైతిక విలువలు లేకుండా మాట్లాడుతున్నాయని, ఆ పార్టీలను గెలిపించరాదని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బాగేపల్లి మాజీ ఎమ్మెల్యే జి.వి.శ్రీరామరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన హీరేబిదనూరు జెడ్పీ అభ్యర్థి శ్రీనివాస్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచార సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోనే అవినీతి పాలన సాగించిన జెడ్పీలలో చిక్కబళ్లాపురం అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. ఐదు సంవత్సరాల్లో ఐదుగురు అధ్యక్ష పదవులను అలంకరించి వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ అభివృద్ధి పేరిట బడా కంపెనీలకు లబ్ధి కలిగిస్తోందన్నారు. ఇన్వెస్ట్ కర్ణాటక పేరిట వందల ఎకరాల భూమిని పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తోందన్నారు. అదే విధంగా జేడీఎస్ కుమారస్వామి బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఈ జిల్లాకు శాశ్వత నీటి వనరులు కల్పించాలంటే సీపీఎం పార్టీని గెలిపించాలన్నారు. ప్రచారం కార్యక్రమంలో సీపీఎం నాయకులు సి.సి. అశ్వత్థప్ప, రవిచంద్రరెడ్డి, అభ్యర్థి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement