రాజధాని మాస్టర్‌ డెవలపర్‌కు నోటిఫికేషన్‌ | crda released notification for capital master develeper | Sakshi
Sakshi News home page

రాజధాని మాస్టర్‌ డెవలపర్‌కు నోటిఫికేషన్‌

Published Wed, Jan 4 2017 11:26 AM | Last Updated on Tue, Sep 5 2017 12:24 AM

crda released notification for capital master develeper

విజయవాడ: రాజధాని మాస్టర్‌ డెవలపర్‌ ఎంపికకు సీఆర్‌డీఏ టెంటర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో సింగపూర్‌ కంపెనీలు ఇచ్చిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 6.84 చదరపు కిలోమీటర్ల సీడ్‌ క్యాపిటల్‌కు సీఆర్‌డీఏ మాస్టర్‌ డవలపర్‌ను ఎంపిక చేయనుంది.

టెండర్లు దాఖలు చేయడానికి ఫిబ్రవరి 21వ వరకు గడువు ఇచ్చింది. మళ్లీ సింగపూర్‌ కంపెనీలకు మేలు చేసే విధంగానే టెండర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. బిడ్డింగ్‌ ప్రక్రియలో రెండు స్టేజీలను సీఆర్‌డీఏ ఎంపిక చేసింది. మొదటి దశలో అర్హతలను నిర్ధారించనుంది. పోటీ సంస్థల అర్హత నిర్ధారించాకే అసలైన బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వనుంది. అర్హత సాధించిన సంస్థలకు మాత్రమే ఒరిజినల్‌ ప్రాజెక్టు వివరాలను సీఆర్‌డీఏ ఇవ్వనుంది. సింగపూర్‌ కంపెనీలతో సీల్డ్‌ కవర్‌ ఒప్పందాన్ని మాత్రం బయటపట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఏ మాత్రం ఇష్టపడటం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement