సర్టిఫికెట్లు జారీ చేసిన దొంగ దొరికాడు
Published Wed, Oct 2 2013 12:07 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM
మంత్రి, ఎమ్మెల్యేకి డెత్ సర్టిఫికెట్లు జారీ చేసిన అంశం కొలిక్కి వచ్చింది. పనుల్లో తనకు అవకాశం ఇవ్వలేదన్న అక్కసుతో కాంట్రాక్టర్ అతితెలివి ప్రదర్శించినట్లు తేలింది. అలాగే మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సాక్షి, చెన్నై: రాష్ట్ర సహకారశాఖ మంత్రి సెల్లూరు కె.రాజు, సీపీఎం ఎమ్మెల్యే అన్నాదురైలకు మదురై కార్పొరేషన్ నుంచి డెత్ సర్టిఫికెట్లు జారీ కావడం తెలిసిందే. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయూంశమైంది. సైబర్ క్రైం రంగంలోకి దిగడంతో విచారణ వేగం పుంజుకుంది. ఓ కంప్యూటర్ నుంచి ఈ సర్టిఫికెట్లు ప్రింట్ తీసి ఉండడం వెలుగు చూసింది. ఆ కంప్యూటర్‌ను ఉపయోగించే సిబ్బందిని విచారించడంతో అసలు విషయం బయటపడింది. కార్పొరేషన్ కాంట్రాక్టర్ పొన్నురాం ఈ వ్యవహారం వెనుక ఉన్నట్లు తేలింది.
అసలు కథ ఇదీ
జన, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరు, కాంట్రాక్టు కార్మికుల నియూమకం, కంప్యూటర్ల పర్యవేక్షణ తదితర పనుల్ని కాంట్రాక్టర్ పొన్నురామ్‌కు గతంలో అప్పగించారు. ఇటీవల ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టడంతో అన్ని పనులూ మరో కాంట్రాక్టర్ మురుగేషన్ చేతికి చేరారుు. మేయర్ రాజన్ చెల్లప్పకు మురుగేషన్ సన్నిహితుడు కావడంతో కాంట్రాక్టులన్నీ ఆయనకే అప్పగించడం మొదలైంది. తనకు కాంట్రాక్ట్‌లు దూరమవడాన్ని పొన్నరాం జీర్ణించుకోలేకపోయూడు.
మురుగేషన్ ను అప్రతిష్ట పాలు చేయడం లక్ష్యంగా పథకం రచించాడు. జనన, మరణ విభాగంలో కాంట్రాక్టు కార్మికులుగా ఉన్న వారిలో తన సన్నిహితులతో పథకం అమలు చేరుుంచాడు. నకిలీ సర్టిఫికెట్ల జారీని వేగవంతం చేశాడు. ఈ వ్యవహారం ఏదో ఒకరోజు వెలుగులోకి రావడం తథ్యమని, తద్వారా మురుగేషన్ ఇరకాటంలో పడతాడని భావించాడు. అయితే మంత్రి, ఎమ్మెల్యేలకు డెత్ సర్టిఫికెట్లు మంజూరు చేసి పొన్నురాం, అతని సన్నిహితులు ముగ్గురు సైబర్ క్రైమ్‌కు చిక్కారు.
Advertisement