వచ్చే నెల నాలుగున జరగనున్న 70 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల కోసం 900 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే 210 మంది అభ్యర్థుల నామినేషన్‌లు తిరస్కరించామని
న్యూఢిల్లీ: వచ్చే నెల నాలుగున జరగనున్న 70 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల కోసం 900 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే 210 మంది అభ్యర్థుల నామినేషన్‌లు తిరస్కరించామని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి విజయ్ దేవ్ తెలిపారు. వారి దరఖాస్తుల్లో తప్పులు ఉండటం వల్లే అలా చేశామని వివరించారు. ఏఏపీ నుంచి 75, కాంగ్రెస్ నుంచి 70, బీఎస్‌పీ నుంచి 69, బీజేపీ నుంచి 68, సీపీఐ నుంచి 10, ఎన్‌సీపీ నుంచి 9, సీపీఐ(ఎం) నుంచి ముగ్గురి నామినేషన్‌లను ఆమోదించామన్నారు. అలాగే 296 మంది స్వతంత్ర అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 300 మంది కూడా బరిలో ఉన్నారని తెలిపారు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో 1,134 మంది నామినేషన్‌లు దాఖలు చేయగా ఈసీ 194 పత్రాలను తిరస్కరించిందని దేవ్ గుర్తు చేశారు.