ధనుష్‌ దర్శకుడితో సూపర్‌స్టార్‌? | Every director wants to make a film with Superstar Rajinikanth. | Sakshi
Sakshi News home page

ధనుష్‌ దర్శకుడితో సూపర్‌స్టార్‌?

Published Mon, Jul 31 2017 2:06 AM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM

ధనుష్‌ దర్శకుడితో సూపర్‌స్టార్‌?

ధనుష్‌ దర్శకుడితో సూపర్‌స్టార్‌?

తమిళసినిమా: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో చిత్రం చేయాలని ప్రతి దర్శకుడు ఆశ పడతారు. అలాంటి అవకాశం కోసం తపస్సు చేస్తారని అనవచ్చు. సినీయర్‌ దర్శకులతోనే చిత్రాలు చేసే రజనీకాంత్‌ ఇటీవల యువ దర్శకుడు పా.రంజిత్‌కు వరుసగా రెండు సార్లు అవకాశం ఇవ్వడం విశేషమే అవుతుంది.

కాగా తాజాగా మరో కొత్త ప్రచారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ధనుష్‌ దర్శకుడిగా ముద్రపడిన వెట్రిమారన్‌కు రజనీకాంత్‌తో చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారన్నదే ఆ ప్రచారం. నటుడు ధనుష్‌తో ఆడగళం, పొల్లాదవన్‌ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వెట్రిమారన్‌. ఆయనతో కలిసి కాక్కాముట్టై, విచారణై వంటి జాతీయ అవార్డులు పొందిన చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం ధనుష్‌ హీరోగా వడచెన్నై చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

దర్శకుడు వెట్రిమారన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కోసం ఒక కథను సిద్ధం చేశారట. ఇటీవల రజనీని కలిసి కథ వినిపించారు. కథ ఆయనకు బాగా నచ్చేసిందట. అయితే అందులో నటించే విషయమై రజనీకాంత్‌ ఇంకా గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదని సమాచారం. ప్రస్తుతం రజనీకాంత్‌ శంకర్‌ దర్శకత్వంలో 2.ఓ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అదే సమయంలో కబాలి చిత్రం ఫేమ్‌ పా.రంజిత్‌ దర్శకత్వంలో  ధనుష్‌ నిర్మిస్తున్న కాలా చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు. వీటిలో 2.ఓ చిత్రం 2018 జనవరిలో తెరపైకి రానుంది. ఆ తరువాత కాలా ఉం టుంది. తరువాత చిత్రానికే వెట్రిమారన్‌ క్యూలో ఉన్నట్లు కోలీవుడ్‌ టాక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement