బస్టాండ్‌లో చింతాక్రాంతుడై కూర్చున్న జితేంద్ర పట్నాయక్
ఒడిశా, కొరాపుట్: గంజాం జిల్లా జగన్నాథప్రసాద్ బ్లాక్ చడియపల్లి గ్రామం నుంచి జితేంద్ర పట్నాయక్ కుటుంబ పరివారంతో మార్చి 18న కొరాపుట్‌లో జరిగిన తన మరదలు వివాహానికి అత్తారింటికి వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు మాసాల పాటు ఆయన కుటుంబంతో సహా అత్తవారింట్లో చిక్కుకున్నారు. కొరాపుట్‌లో వివాహ కార్యక్రమానికి హాజరై చుట్టుపక్కల జయపురం, బొరిగుమ్మలో ఉన్న దగ్గరి బంధువుల ఇళ్లకు వెళ్లి 15 రోజుల్లో తిరిగి ఇంటికి చేరుకునే ఉద్దేశంతో కొరాపుట్ వచ్చిన తనకు ఈ సంకట పరిస్థితి ఏర్పడిందని మంగళవారం బస్టాండ్‌లో చింతాక్రాంతుడై కూర్చున్న ఆయన విలేకరుల ముందు వాపోయాడు.
మొదటి దఫా లాక్‌డౌన్ ప్రకటన తరువాత లాక్‌డౌన్ సడలింపు జరిగి రోడ్డు రవాణా పరిస్థితి ఏర్పడుతుందన్న ఆశాభావంతో అత్తవారింట్లో కుదురుగా ఉండగలిగానని, అయితే అటు తరువాత లాక్‌డౌన్ పొడిగింపు నాలుగు పర్యాయాలు కొనసాగడంతో ఎక్కడకీ కదల లేక భార్య, కుమారుడు, తల్లితో పాటు అత్తవారింట్లో ఉండలేక మానసిక క్షోభకు గురవుతున్నట్లు వాపోయాడు. నాలుగు రోజులుగా బస్టాండ్‌కు వస్తూ తమ స్వగ్రామానికి వెళ్లేందుకు బస్సులు తిరుగాడే సూచనల కోసం పడిగాపులు కాస్తున్నట్లు చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment