క్వారీలో బ్లాస్టింగ్‌లు నిలిపివేయాలి
Published Tue, Nov 22 2016 2:20 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
శాయంపేట: బ్లాస్టింగ్‌లను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నాయకులు.. విద్యార్థులు, రైతులతో కలిసి మంగళవారం ఉదయం ధర్నా చేశారు. క్వారీల్లో బ్లాస్టింగ్‌ల వల్ల రాళ్లు పడి సమీపంలోని తమ పంటలు నాశనమవుతున్నాయని, ఇళ్లు, పాఠశాల భవనాలు దెబ్బతింటున్నాయని, భారీ పేలుడు శబ్దాలతో భయకంపితులమవుతున్నామని శాయంపేట మండలం మాందారిపేట గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పొలాల్లో పనులకు కూలీలు వచ్చే పరిస్థితులు లేవని, ఆ మార్గంగుండా ప్రయాణాలు కూడా చేయలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. అలాగే ఈ ప్రాంతంలో ఇటీవల ఏర్పాటు చేసిన డాంబర్ ప్లాంట్ వల్ల వచ్చే పొగతో వాయు కాలుష్యం ఏర్పడి తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని అందరూ ముక్తకంఠంతో తెలిపారు. వెంటనే అధికారులు క్వారీల్లో పేలుళ్లు నిలిపివేయాలని, డాంబర్ ప్లాంట్‌ను వేరేచోటకు తరలించాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement