కేసీఆర్.. సీఎం కూడా అయ్యేవాడివి కాదు
కేసీఆర్.. సీఎం కూడా అయ్యేవాడివి కాదు
Published Sat, Feb 25 2017 2:29 PM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM
- కేసీఆర్‌పై డీకే అరుణ విమర్శలు
హైదరాబాద్: కేసీఆర్ కుంటుంబమే ఓ దోపిడీ దొంగలకుటుంబమని, ఆంధ్ర కాంట్రాక్టర్ల మోచేతి నీళ్లు తాగుతూ తెలంగాణను దోచుకుంటున్నారని మాజీ మంత్రి డీకే అరుణ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌లో కాంగ్రెస్ పై చేసిన కామెంట్లపై ఆమె కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి ఉండకపోతే ముఖ్యమంత్రి కాదు కదా చప్రాసీవి కూడా అయ్యే వాడివి కాదని ఎద్దేవ చేశారు. నీ సొంత డబ్బులతో మొక్కులు తీర్చుకోవాలని.. ప్రజాధనంతో కాదని విమర్శించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని, సెంటిమెంట్ ఓట్ల రాజకీయాలు మానుకోమని లేకపోతే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని మండిపడ్డారు.
Advertisement
Advertisement