సాక్షి ప్రతినిధి, బెంగళూరు :
మెట్రో రైలుకు ఫీడర్ లైన్‌గా వ్యవహరించే మోనో రైలును ప్రారంభించడానికి ప్రభుత్వం యోచిస్తోందని హోం మంత్రి కేజే. జార్జ్ తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న మెట్రో రైలు పనులు పూర్తయిన వెంటనే మోనో రైలును అనుసంధానం చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. శాసన సభ సమావేశాలు పూర్తయ్యాక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిపై చర్చిస్తారని చెప్పారు.
నగరంలో మంగళవారం 25వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రయాణికులకు అనుకూలంగా ఉండడానికే మోనో రైలు గురించి ఆలోచిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టును చేపట్టడానికి అనేక కంపెనీలు ముందుకొచ్చాయని, దీనిపై సాధక బాధలను చర్చించిన తర్వాత నిపుణుల అభిప్రాయాలను స్వీకరించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కాగా హోటళ్లు, పబ్‌ల వేళలను పొడిగించే విషయమై పోలీసు శాఖ అవసరమైన చర్యలు చేపడుతోందన్నారు. ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
మోనో రైలుకు సర్కారు యోచన
Published Wed, Jan 22 2014 1:49 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
Advertisement