సదర్‌మాట్‌కు అడ్డుపడుతారేమో... తరిమికొట్టండి
- కాంగ్రెస్సోళ్లు కట్టలేదు.. కడతామంటే అడ్డుకుంటున్నారు..
- రాష్ట్ర నీటిపారుదల మంత్రి హరీశ్
సాక్షి, నిర్మల్: ‘‘మొన్న మల్లన్నసాగర్‌కు అడ్డుపడ్డరు.. నిన్న కాళేశ్వరానికి.. ఇప్పుడు సదర్‌మాట్‌కు అడ్డుపడేందుకు కాంగ్రెస్సోళ్లు వస్తే తరిమికొట్టాలి’’రాష్ట్ర భారీ నీటి పారు దల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు రైతులనుద్దేశించి అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లాకు వచ్చిన ఆయన మామడ మండలంలో పొన్కల్ వద్ద రూ.516 కోట్లతో నిర్మించనున్న సదర్‌మాట్ బ్యారేజీకి శంకు స్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో రైతులను ద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేయలేక పోయారని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తుంటే అడ్డుపడుతోందని విమర్శించారు.
సదర్ మాట్ బ్యారేజీని 2008లో రూ.305 కోట్లతో నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లు పిలిచినప్పటికీ పనులు చేయ లేదని, అప్పుడే పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ప్రభుత్వంపై రూ.200 కోట్లపై భారం తప్పే దని అన్నారు. నిర్మల్, జగిత్యాల ల్లోని 16వేల ఎకరాల ఆయకట్టుకు సదర్ మాట్ బ్యారేజీతో సాగు నీరు అందుతుం ద న్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి రాదంటున్న కాంగ్రెస్, తమ్మడి హెట్టి వద్ద నీళ్లు లేవన్న కేంద్ర జలవనరుల సంఘం చెప్పిన విషయాన్ని మరువరాదని తెలిపారు. సభలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు విద్యా సాగర్ రావు, రేఖ నాయక్, విఠల్‌రెడ్డి, కలెక్టర్ ఇలంబర్తి పాల్గొన్నారు.