'40వేల ఆలయాలను స్వాధీనం చేసుకుంటాం'
Published Sat, May 27 2017 7:56 PM | Last Updated on Tue, Sep 5 2017 12:09 PM
వేలూరు: తమిళనాడు రాష్ట్రంలోని 40వేల ఆలయాలను స్వాధీనం చేసుకొని అభివృద్ది చేస్తామని హిందూ మున్నాని తమిళనాడు ప్రధాన కార్యదర్శి మురుగానందం తెలిపారు. శనివారం ఉదయం వేలూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ఆలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో ఎటువంటి అభివృద్ది జరగలేదని, వీటిని తాము స్వాధీనం చేసుకొని అభివృద్ది చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఆలయాల్లో పౌర చట్టాన్ని అమలు చేయాలని, మత మార్పిడి చట్టాన్ని నిలుపుదల చేయాలని, హిందువులపై మతపరమైన దాడులను అరికట్టాలని, హిందువులకు ఉచిత చట్ట సహాయం చేయాలని, హిందువుల కేసులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని, తదితర సమస్యలపై సమావేశంలో తీర్మానించారు.
Advertisement
Advertisement