బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని ఐఐఐటీ–బీలో నాలుగో సెమిస్టర్ చదువుతున్న హైదరాబాద్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
బొమ్మనహళ్లి(కర్ణాటక): బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని ఐఐఐటీ–బీలో నాలుగో సెమిస్టర్ చదువుతున్న హైదరాబాద్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నగరానికి చెందిన సాయి శరత్(22) ఎలక్ట్రానిక్ సిటీ మొదటి పేజ్‌లో ఉన్న ఇంటర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బెంగళూరు సంస్థలో ఎంటెక్ 4వ సెమిస్టర్ చదువుతున్నాడు.
ఇక్కడే క్యాంపస్ హాస్టల్లో ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం5.30గంటల సమయంలో సాయి శరత్ క్యాంపస్ 7వ అంతస్తుకు వెళ్లి పైనుంచి కిందికి దూకాడు. రక్తపు మడుగులో ఉన్న అతడిని సిబ్బంది చూసి, ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అతని ఆత్మహత్యకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.