నేను కారణం కాదు | I will not cause | Sakshi
Sakshi News home page

నేను కారణం కాదు

Published Tue, May 20 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM

I will not cause

  • రమ్య ఓటమిపై అంబరీశ్
  •  ఆమెను మంత్రి కాదు.. సీఎంగా చేసినా సంతోషమే
  •  సాక్షి ప్రతినిధి, బెంగళూరు : మండ్య లోక్‌సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, సినీ నటి రమ్య ఓటమికి తాను కారణం కాదని ఆ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అంబరీశ్ తెలిపారు. సోమవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభంజనం వీచినప్పటికీ, మండ్యలో ఆ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకుండా చూసుకున్నామని చెప్పారు.

    రమ్య ఓటమికి తానే కారణమంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, శక్తికి మించి పార్టీ అభ్య ర్థుల విజయానికి కృషి చేశామని తెలిపారు. రమ్యకు మంత్రి వర్గంలో స్థానం లభిస్తుందని వినవస్తుండడంపై ఆయన వ్యాఖ్యానిస్తూ, ‘మంత్రి పదవే కాదు, ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా సంతోషమే. వచ్చే ఎన్నికల్లో రమ్య అత్యధిక మెజారిటీతో గెలుపొందవచ్చు’ అని అన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement