ఆకట్టుకుంటున్న రొసాటోమ్ ఆర్ట్ ఎక్స్‌పో..
–పెయింటింగ్‌ల్లో ఇండియా–రష్యా స్నేహ సంబంధాలు
కొరుక్కుపేట: రష్యన్ స్టేట్ ఆటామిక్ ఎనర్జీ కార్పొరేషన్ (రోసాటోమ్), రష్యన్ సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ కల్చర్ సంయుక్త ఆధ్వర్యంలో 70 సంవత్సరాల ఇండియా –రష్యా స్నేహ సంబంధాలను గుర్తుకు తెచ్చేలా రొసాటోమ్ ఆర్ట్ ఎక్స్‌పోను శుక్రవారం నుంచి ప్రారంభించారు. స్థానిక ఆల్వార్ పేటలోని రష్యన్ సెంటర్ ఆఫ్ సైన్స్ అండ కల్చర్ వేదికగా రొసాటోమ్ –సౌత్ ఆసియా రీజనల్ వైస్ ప్రెసిడెంట్ అలెక్సీ పిమేనోవ్, రష్యన్ ఫెడరేషన్ – సౌత్ ఇండియా కాన్సులేట్ జనరల్ వైస్ ప్రెసిడెంట్ మైఖిల్ గోర్బాటోవ్ పాల్గొని లాంచనంగా ప్రారంభించారు.‘ఎనర్జీ ఫ్రెండ్‌షిప్– బ్రష్ స్ట్రోక్స్ ’ అ«ంశంతో చెన్నై , ఢిల్లీకి చెందిన 10మంది చిత్రకారులు బలమైన ఇండియా – రష్య స్నేహబంధం ను తెలియజేస్తూ పెయింటింగ్‌లను వేశారు.
ఒక్కో పెయింటింగ్ ఆకట్టుకోవడమే కాకుండా ఏడు దశాబ్దాల కాలంలో రెండు దేశాల మద్య అణువిద్యు త్, విద్య, వ్యాపార సంబంధాలు తెలుపుతున్నాయి. ఈ సందర్భంగాగా పెయింటింగ్‌లు వేసిన ఆర్టిస్టులు పద్మనాభన్. వి. కృష్ణ. పిఎన్‌వి హరి , సుంఘవి, యూకే.నారెన్ నో, విద్యా సుందర్, ప్రవీణ్ చ్రిస్‌పగ్, సుమిత సుందరం, మురుగేశన్, ఢిల్లీకి చెందిన ఆర్టిస్టు ఆక్షత్ సిన్హాలను ఘనంగా సత్కరించుకున్నారు. అనంతరం మైఖిల్ మాట్లాడుతూ విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ఆర్ట్ ఎక్స్‌పోను సెప్టెంబర్ 1వ తేదీ వరకు సందర్శకులకు వీక్షించవచ్చునని తెలియజేశారు.