
ఇస్రో 'ఏటీవీ' రాకెట్ విజయవంతం
ఇస్రో నుంచి స్క్రాంజెట్ మోటార్‌ను అమర్చిన ఏటీవీ రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది
నెల్లూరు: ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఏటీవీ రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెహికిల్ (ఏటీవీ) ప్రయోగాన్ని షార్ శాస్త్రవేత్తలు 60 సెకన్లలోపే పూర్తిచేయగా, ఏటీవీ తొలి 5 సెకెన్లలోపే 70 కిలోమీటర్ల లక్ష్యాన్ని పూర్తిచేసింది. ఆ తర్వాత కూస్టింగ్ దశలో సెకనుకు రెండు కిలోమీటర్ల వేగంతో నింగిలోకు దూసుకుపోయింది. ఈ ప్రయోగాన్ని ఇస్త్రో చేర్మన్ కిరణ్‌కుమార్, షార్ డైరెక్టర్ శివన్ ఉన్నికృష్ణన్ తదితర శాస్త్రవేత్తలు వీక్షించారు. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఏటీవీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
దాంతో ఏటీవీ రాకెట్ ప్రయోగం విజయవంతమైనట్టు ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు.నింగిలోకి ప్రవేశపెట్టానికి రాకెట్‌లో స్క్రాంజెట్ మోటార్‌ను అమర్చి ప్రయోగించారు. ఈ ప్రయోగంలో ఆక్సిజన్‌కు బదులుగా గాలి ఇంధనంగా ప్రయోగించినట్టు ఇస్రో పేర్కొంది. ఏటీవీ ప్రయోగంతో భవిష్యత్తులో ప్రయోగాల వ్యయం తగ్గనుంది. అలాగే భవిష్యుత్తులో బరువైన రాకెట్లను నింగిలోకి ప్రయోగించే అవకాశం ఉంది.