
ఐటీ ఇంజినీరు ‘అతి’
ఫుడ్ డెలివరీ బాయ్‌ను దూషించిన ఘటనలో ఐటీ ఇంజనీర్ అరెస్ట్ అయ్యాడు.
సాక్షి, బెంగళూరు: ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన బాయ్ కన్నడలో మాట్లాడినందుకు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతన్ని దూషించిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. ఢిల్లీకి చెందిన సాత్విక్ నగరంలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఐటీ ఇంజినీర్‌గా పనిచేస్తూ సంజయనగర్‌లో నివాసముంటున్నాడు.
ఆన్‌లైన్‌లో పిజ్జా కోసం ఆర్డర్ చేయగా లేటుగా వచ్చావంటూ డెలివరీబాయ్ అనిల్‌ని అసభ్యపదజాలాలతో దూషించాడు. ఆలస్యానికి క్షమించాలంటూ అనిల్ కన్నడలో మాట్లాడారు. దీంతో మరింత కోపోద్రిక్తుడైన సాత్విక్ నా ముందు కన్నడలో మాట్లాడవద్దంటూ మరింతగా దూషించాడు. దీనిపై డెలివరీబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంజయ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.