సీఎస్ ఇంట్లో ముగిసిన ఐటీ దాడులు!
చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహనరావు ఇంట్లో ఐటీ దాడులు బుధవారం రాత్రి ముగిశాయి. అన్నానగర్‌లోని అయ్యప్పన్ కోయిల్ సమీపంలో 17/184 డోర్ నంబరులో ఉన్న ఆయన ఇంటికి బుధవారం ఉదయం సెక్షన్ 133 కింద విచారణ కోసం వెళ్లిన అధికారులు.. ఆ తర్వాత సమన్లు జారీచేసి, దాన్ని దాడులుగా మార్చిన విషయం తెలిసిందే.
బుధవారం ఉదయం నుంచి జరిపిన దాడుల్లో భారీగా నగదు, బంగారంతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. రామ్మోహనరావు, ఆయన కొడుకు, బంధువులు, సన్నిహితులకు చెన్నై, బెంగళూరు, చిత్తూరులలో ఉన్న 13 ఇళ్లలో సోదాలు జరిగాయి. బుధవారం దాడుల్లో సేకరించిన ఆధారాలను బట్టి ఐటీ దాడులు మరిన్ని జరిగే అవకాశమున్నట్లు సమాచారం. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డితో రామ్మోహనరావుకు సంబంధాలు ఉన్నాయనే కోణంలోనే ఈ దాడులు జరిగినట్లు భావిస్తున్నారు. శేఖర్ రెడ్డి, ఆయన ఆడిటర్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. (చదవండి: సీఎస్ ఇంటిపై ఐటీ దాడులు!)