బోనులో చిక్కిన చిరుత | Leopard caught in the cage | Sakshi
Sakshi News home page

బోనులో చిక్కిన చిరుత

Published Thu, Apr 28 2016 4:55 PM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM

Leopard caught in the cage

కర్నాటక రాష్ట్రం దొడ్డ బళ్లాపురం తాలూకాలోనిమాడేశ్వర గ్రామం,చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు గత కొన్ని రోజులుగా కంటిమీద కునుకులేకుండా చేసిన చిరుతపులి ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. దీంతో గ్రామాల ప్రజలు హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.

 వారం రోజులుగా చిరుతపులి గ్రామ శివార్లలో మేస్తున్న గొర్రెలు, ఇతర ప్రాణులను బలితీసుకుంటోంది. దీంతో, పాడి రైతులు పశువులను మేతకు వదలడానికే జంకుతున్నారు. పొలాల్లో పనులకు వెళ్లేందుకు సైతం ఇబ్బందిగా మారింది.  గ్రామస్తులు ఇంటికే పరిమితమూ పోయారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు వలపన్ని చిరుతను పట్టుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement