లింగరాజుకు పస్తులు
Published Mon, Mar 27 2017 9:08 PM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM
► నియోగుల మధ్య తలెత్తిన విభేదాలు
► స్వామికి అందని సేవలు
భువనేశ్వర్: దైవానుగ్రహం కోసం భక్తులు ఉపవాసం చేయడం ఆనవాయితీ. నగరంలోని ఏకామ్ర క్షేత్రంలో కొలువుదీరిన లింగరాజు మహా ప్రభువు నిత్య నైవేద్యాలు అందక పస్తు ఉండాల్సిన పరిస్థితులు చోటుచేసుకోవడం నివ్వెరపరుస్తుంది.
రెండు వర్గాల నియోగుల మధ్య విభేదాలతో ఈ పరిస్థితి తలెత్తింది. శనివారం వారుణి మహా స్నానం సేవ పురస్కరించుకుని రెండు వర్గాల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా స్వామికి నిర్వహించాలి్సన పల్లకి సేవకు అంతరాయం ఏర్పడింది. తదనంతరం నిర్వహించాలి్సన సేవాదులు నిరవధికంగా స్తంభించిపోయాయి. శనివారం సాయంత్రం నుంచి ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుంది. బ్రాహ్మణ నియోగులు, బొడు నియోగుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. దేవస్థానంలో సేవాదులకు సంబంధించి అధికార వర్గం స్పష్టమైన వేళల్ని జారీ చేయనందున ఇటువంటి దయనీయ పరిస్థితులు తలెత్తుతున్నాయి.
నియోగుల మధ్య బిగుసుకుంటున్న వివాదం పరిష్కరించేందుకు లింగరాజ్ దేవస్థానం అధికార వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్టు కార్యనిర్వహణ అధికారి మనోరంజన్ పాణిగ్రాహి తెలిపారు. మహా వారుణి స్నాన సేవ నిర్వహించేందుకు పల్లకి సేవ ముందుగా చేయాల్సి ఉంటుంది. పల్లకి సేవకు బ్రాహ్మణ నియోగులు అడ్డు తగలడంతో వివాదం చోటుచేసుకున్నట్టు బొడు నియోగుల సంఘం కార్యదర్శి కమలాకాంత బొడు తెలిపారు.
Advertisement
Advertisement