ఆదర్శ ఆరోగ్య కేంద్రంగా ‘లోక్‌నాయక్’ | Lok Nayak Hospital to be made model health care facility | Sakshi
Sakshi News home page

ఆదర్శ ఆరోగ్య కేంద్రంగా ‘లోక్‌నాయక్’

Published Mon, Jun 2 2014 10:06 PM | Last Updated on Sat, Sep 2 2017 8:13 AM

Lok Nayak Hospital to be made model health care facility

 సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధానిలోని లోక్‌నాయక్ ఆస్పత్రి త్వరలో ఆదర్శ ఆరోగ్య కేంద్రంగా అభివృద్ధి చెందనుంది. ఇందుకోసం చేపట్టిన పనుల పురోగతిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సోమవారం సమీక్షించారు. ముఖ్యకార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్  సెక్రటరీ, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి, లోక్‌నాయక్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్,  ఉత్తర ఢిల్లీ మున్సిపల్  కార్పొరేషన్ కమిషనర్, డీజేబీ సీఈఓ, ట్రాఫిక్ విభాగం స్పెషల్ కమిషనర్ తదితర అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ ఆస్పత్రిలో పనుల ప్రగతిపై రూపొందించిన ప్రజెంటేషన్‌ను నజీబ్ జంగ్ ఈ సందర్భంగా వీక్షించారు.
 
 ఆస్పత్రి సిబ్బందిని రోగులు గుర్తించేందుకు వీలుగా వారికి  నేమ్ ట్యాగ్‌లతో కూడిన డ్రస్ కోడ్‌ను ప్రవేశపెట్టాలని నజీబ్‌జంగ్ చేసిన సూచనను ఆస్పత్రి అధికారులు అమల్లోకి తీసుకొచ్చారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే రోగులకు తగిన మార్గదర్శకత్వాన్ని ఇవ్వడం కోసం పేషంట్ వెల్ఫేర్ అధికారులను నియమించాలన్న ఎల్జీ ఆదేశాలనుకూడా పాటించినట్లు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ తెలిపారు. ఢిల్లీ హెల్త్ సర్వీసెస్‌కు చెందిన ఐదుగురు అధికారులను ఇందుకోసం నియమించారు. ఆస్పత్రి సిబ్బంది కోసం బయోమెట్రిక్ హాజరు పద్ధతిని దశల  వారీగా ప్రవేశపెడుతున్నామని, వచ్చే నెల ఒకటో తేదీనాటికి మొత్తం 4,000 సిబ్బందికి ఈ పద్ధతిని వర్తింపజేస్తామని  మెడికల్ సూపరింటెండెంట్ చెప్పారు. ఈ పనిని వేగంగా పూర్తిచేయాలంటూ ఎల్జీ ఈ సందర్భంగా సంబంధిత అధికారులను ఆదేశించారు. కొత్త ఓపీడీ బ్లాక్ నిర్మాణ ం ఈ నెలాఖరుకల్లా పూర్తవుతుందని ప్రజాపనుల శాఖ  కార్యదర్శి లె ఫ్టినెంట్ గవర్నర్‌కు హామీ ఇచ్చారు.
 
 ఆస్పత్రిలో వంటశాల, కేటరింగ్ సదుపాయాల పట్ల ఎల్జీ  తన పర్యటన సమయంలో అసంతృప్తిని వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ సదుపాయాలను మెరుగుపరచడం కోసం డైటీషియన్లకు శిక్షణ  ఇప్పించామని,వంటశాలను మెరుగుపరిచామని తెలిపారు. ఆస్పత్రి ఆవరణలో అక్రమంగా దుకాణాలు నడుపుతున్నవారిని తొల గించా లని, అక్రమ పార్కింగ్‌లను నిర్మూలించాలని నజీబ్ జంగ్ దృష్టికి మెడికల్ సూపరింటెండెంట్  తీసుకొచ్చారు. ఎమర్జెన్సీ వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అనధికార వాహనాల పార్కింగ్‌లను తొలగించాలని, ప్రతి రోజూ తనిఖీలు జరపాలని నజీబ్‌జంగ్ ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. ఆస్పత్రిలో కొత్త పార్కిం గ్ సదుపాయాన్ని కల్పించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ తెలి పారు. డయాలిసిస్ సౌకర్యం అత్యంత కీలకమని, దానికి నీటిసరఫరా చేయడానికి డీజేబీ  తొలి ప్రాధాన్యమివ్వాలని నజీబ్‌జంగ్ ఆదేశించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement