అడ్రస్‌ చెప్పమంటూ మెడకు కత్తి.. | man held for attacking man with knife | Sakshi
Sakshi News home page

అడ్రస్‌ చెప్పమంటూ మెడకు కత్తి..

Published Sat, Jun 17 2017 10:55 AM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM

అడ్రస్‌ చెప్పమంటూ మెడకు కత్తి..

అడ్రస్‌ చెప్పమంటూ మెడకు కత్తి..

తిరువొత్తియూరు: మహిళా ఉపాధ్యాయిని అడ్రస్‌ చెప్పమని కోరుతూ వృద్ధుడి మెడపై కత్తి పెట్టి హత్యా బెదిరింపులకు పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై, పూందమల్లి సమీపంలో గురువారం సాయంత్రం 7గంటలకు మహిళా ఉపాధ్యాయిని అడ్రస్‌ చెప్పాలని కోరుతూ ఓ యువకుడు వృద్ధుడి మెడపై కత్తి పెట్టి బెదిరించాడు.

అక్కడున్న వారిలో ఒకరు వృద్ధుడిని రక్షించేందుకు యువకుడిపై రాయి విసిరాడు. ఆ యువకుడు తప్పుకోవడంతో రాయి వృద్ధుడికి తగిలి గాయమైంది. ఆ యువకుడు దాదాపు 30 నిమిషాల వరకు వృద్ధుడి మెడపై నుంచి కత్తి తీయలేదు. చివరకు స్థానికులు యువకుడిని చుట్టుముట్టి పట్టుకొని పూందమల్లి పోలీసులకు అప్పగించారు. విచారణలో పట్టుబడిన యువకుడు పార్తిబన్‌ అని, ఆ వృద్ధుడు ఉపాధ్యాయిని తండ్రి అని తెలిసింది. పార్తిపన్‌ మానసిక స్థితి సరిగా లేదని తెలిసింది. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కీల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వృద్ధుడిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement