
టీనగర్: కడలూరు జిల్లా వేప్పూర్ సమీపంలో వివాహ బ్యానర్‌ను చింపిన ఇద్దరిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. చేపాక్కం గ్రామానికి చెందిన పెరియస్వామికి శుక్రవారం వివాహం జరగాల్సి ఉంది. ఇందు కోసం ఇంటి ముందు స్నేహితులు బ్యానర్ ఏర్పాటు చేశారు. దీన్ని అదే గ్రామానికి చెందిన చిన్నదురై కుమారులు మణికంఠన్ (26), శివ (23) ఇరువురు చింపివేశారు. దీంతో పెరియస్వామికి బ్యానర్‌ను చింపిన యువకులకు మధ్య గొడవ జరిగింది. కొద్దిసేపట్లో వధువు బంధువు ఒకరు మృతి చెందినట్లు సమాచారం అందింది. దీంతో వధువు ఇంటి వారు శకునం సరిలేదని చెప్పి, వివాహాన్ని నిలిపివేసి వధువును ఇంటికి తీసుకెళ్లారు. దీంతో ఆగ్రహించిన వరుడు పెరియస్వామి ఇద్దరు యువకులు తన వివాహానికి అడ్డుపడినట్లు వేప్పూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి మణికంఠన్, శివను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment