మాడంబాక్కంలో భార్య, భర్తల మధ్య జరిగిన ఘర్షణలో మనస్తాపం చెందిన భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
అన్నానగర్ : మాడంబాక్కంలో భార్య, భర్తల మధ్య జరిగిన ఘర్షణలో మనస్తాపం చెందిన భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మాడంబాక్కం, పద్మావతి నగర్, 23వ వీధికి చెందిన షణ్ముగం(40). కేళంబాక్కంలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని భార్య రేఖ(34). వీరికి మూడు సంవత్సరాల కుమార్తె ఉంది. ఈ చిన్నారికి త్వరలో పుట్టినరోజు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం చిన్నారి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించే విషయంలో భార్యభర్తలకు మధ్య ఘర్షణ జరిగింది.
దీంతో షణ్ముగం చిన్నారిని తీసుకుని తన తల్లి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో రేఖ ఒంటరిగా ఉంది. అంతకుముందు జరిగిన ఘర్షణతో మనస్తాపం చెందిన రేఖ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి ఇంటికి వచ్చిన షణ్ముగం భార్య ఉరి వేసుకుని శవంగా కనిపించడంతో దిగ్భ్రాంతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న సేలైయూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.