సాక్షి, ముంబై: నగరవాసులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురుచూస్తున్న మెట్రో, మోనో రైళ్ల సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలు అందుబాటులోకి వస్తే నగరవాసులకు ట్రాఫిక్ తిప్పలు తప్పినట్టే. మోనో రైలు సేవలను గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిపోయిన పనులను చకచకా పూర్తిచేస్తున్నారు.
అంతేకాకుండా మెట్రో, మోనో రైల్వే స్టేషన్ల నుంచి బస్సు సేవల విషయమై బృహన్‌ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ పదాధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ రెండు మార్గాల ద్వారా రైలు దిగిన ప్రయాణికులకు ఏ రూట్లో, ఏ సమయంలో బస్సులు నడిపితే సౌకర్యవంతంగా ఉంటుందనే అంశంపై ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఇందుకు ముంబై మెట్రో-1 ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా తనవంతు సహకారం అందిస్తోంది.
సాధ్యమైనంత త్వరగా మోనో రైలు సేవలను ప్రారంభించాల ని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కేవలం సేవ లు ప్రారంభిస్తే సరిపోదు కాబట్టి ముందుగా రైలు దిగిన ప్రయాణికులకు అన్ని స్టేషన్లలో ప్రజా రవాణా వ్యవస్థను సిద్ధం చేయా ల్సి ఉంటుంది. లోకల్ రైల్వే స్టేషన్ల మాదిరిగా మెట్రో, మోనో రైల్వే స్టేషన్ల వద్ద ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరగనుంది. ప్రయాణికులు స్టేషన్ నుంచి బయటపడగానే వారికి బస్సు సేవలు అందుబాటులో ఉంచేందుకు వీలుగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
త్వరలో వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మెట్రో రైలు, చెంబూర్- వడాల-జాకబ్ సర్కిల్ (సాత్ రాస్తా) మోనో రైలు తొలి విడత సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు మార్గాల రైల్వే స్టేషన్లు అత్యాధునికంగా ఉంటాయి.
త్వరలో మోనో, మెట్రో సేవలు ప్రారంభం
Published Sun, Jan 19 2014 11:24 PM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM
Advertisement