ఎస్‌ఏ రాజ్‌కుమార్‌కు అధ్యక్ష పదవి | Movie music artists association elected president sa rajkumar | Sakshi
Sakshi News home page

ఎస్‌ఏ రాజ్‌కుమార్‌కు అధ్యక్ష పదవి

Published Tue, Mar 15 2016 8:46 AM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM

Movie music artists association elected president sa rajkumar

చెన్నై :  సినీ సంగీత కళాకారుల సంఘం అధ్యక్షుడిగా మరోసారి సంగీత దర్శకుడు ఎస్‌ఏ రాజ్‌కుమార్‌కే పట్టం కట్టారు. ఈ సంఘం 2016-2018కి ఎన్నికలు ఆదివారం సంఘం కార్యాలయంలో జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు సంగీత దర్శకుడు ఎస్‌ఏ.రాజ్‌కుమార్ గెలుపొందారు. కార్యదర్శిగా టోమ్నిక్ సేవియర్, కోశాధికారిగా పీజీ వెంకటేశ్ విజయం సాధించారు.

ఉపాధ్యక్షుడి పదవికి సంగీత దర్శకులు దినా, జయచంద్రన్, టీకే మూర్తి, పి.సెల్వరాజ్, త్రినాథ్‌రావు గెలుపొందారు. అలాగే ఈ ఎన్నికల్లో  పీవీ రమణ, ఎల్‌వీ సుధాకర్, రంగరాజ్, సెల్వరాజ్, బెర్నాడ్‌లు విజయం సాధించారు.  ఈ సంఘంలో మొత్తం 525 మంది సభ్యులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement