న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నెలవారీ ఆకాశవాణి కార్యక్రమం ‘మనసులో మాట(మన్‌కీ బాత్)’ ప్రసంగాల సంకలనంతో రాసిన పుస్తకాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం బుధవారం ఇక్కడ ప్రపంచ పుస్తక ప్రదర్శనలో ఆవిష్కరించారు. ఆకాశవాణిలో 2014 అక్టోబర్ 3 నుంచి 2016 నవంబర్ 27 వరకు ప్రసారమైన అన్ని ఎపిసోడ్‌లను యూపీలోని ఫైజాబాద్‌కు చెందిన 29 ఏళ్ల పరిశోధనా విద్యార్థి రాజీవ్ గుప్తా ఈ పుస్తకంలో పొందుపరిచారు.
ప్రధాని ప్రసంగా పుస్తక రూపంలో ‘మన్‌కీ బాత్’ లను రాతపూర్వకంగా నమోదుచేసిన గుప్తాను మంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు. ‘మన్‌కీ బాత్ ఎపిసోడ్‌లు యూట్యూబ్, దూరదర్శన్ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నా ,ప్రజలు తీరిక సమయంలో చదివేలా వాటిని పుస్తకరూపంలో తీసుకురావడం ఆహ్వానించదగినది’ అని ఓరం అన్నారు.
మోదీ ‘మనసులో మాట’పై పుస్తకం
Published Thu, Jan 12 2017 10:36 AM | Last Updated on Tue, Oct 9 2018 4:36 PM
Advertisement
Advertisement