= కేంద్ర మంత్రి మల్లికార్జున ఖర్గే
రాయచూరు రూరల్, న్యూస్‌లైన్ : ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలే తప్ప రాజకీయాలతో ముడిపెట్టరాదని, తన 43 ఏళ్ల రాజకీయ జీవితంలో అభివృద్ధి కోసమే కృషి చేశానని కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే అన్నారు. ఆయన శనివారం రాయచూరు తాలూకాలోని మటమారి గ్రామం వద్ద మటమారి-మంత్రాలయం మధ్య రైల్వే లైను డబ్లింగ్, తుంగభద్ర వంతెన పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన గావించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రైల్వే శాఖలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
రైల్వే శాఖలో అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదన్నారు. రైల్వే బోగీలు, ఇంజన్లు ఉత్పాదన పరిశ్రమను యాదగిరిలో జర్మనీ సహాయంతో స్థాపించి, ఎల్‌హెచ్‌పీని ఏర్పాటు చేస్తామన్నారు. నూతన రైల్వే మార్గాల నిర్మాణానికి భూ స్వాధీన ప్రక్రియలో రైతులు ముందుకు రాకపోవడంపై ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవిషయంలో ఎమ్మెల్యేలు సహకరిస్తే రైల్వే మార్గాల అభివృద్ధికి వీలుంటుందన్నారు.
పంచవర్ష ప్రణాళికలో రాష్ట్రానికి కేంద్రం రూ. 26 వేల కోట్ల నిధులు కేటాయించిందని, రాష్ట్ర వాటాగా రూ.13 వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. 6 నెలల్లో ప్యాసింజర్ రైళ్లకు 15 శాతం ఆదాయం పెరిగిందన్నారు. ఈ ఏడాది నీటి పారుదల పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5500 కోట్లు కేటాయించగా, రూ. 4 వేల కోట్లు అప్పర్‌భద్ర ప్రాజెక్ట్‌కు విడుదల చేశామన్నారు.
అభివృద్ధితో రాజకీయాలు ముడిపెట్టరాదు
Published Sun, Dec 15 2013 3:22 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
Advertisement
Advertisement