నామినేషన్ పత్రాలు తీసుకోవడానికి ఆసక్తి
తిరువళ్లూరు: స్థానిక సంస్థలకు ఎన్నికల నగరా మోగిన నేపథ్యంలో మొదటి రోజు పూండీ, కడంబత్తూరు, ఈకాడు యూనియన్ కార్యాలయాలకు నామినేషన్ వేయడానికి అభ్యర్థులు ఎవరూ రాకపోవడంతో బోసిపోయింది. యూనియన్, జిల్లా కౌన్సిలర్, పంచాయతీ అధ్యక్షుడు, వార్డు సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్, మేజర్ పంచాయతీ, వార్డు మెంబర్‌లకు వచ్చే నెలలో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ తీసుకునే ప్రక్రియను సోమవారం నుంచి ప్రారంభిస్తున్న ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే నామినేషన్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైనా ఒక్క నామినేషన్ కూడా నమోదు కాలేదు. దీంతో ఏఆర్‌వోల కార్యాలయాలు బోసిపోయాయి. నామినేషన్ వేయడాని ఎవరూ ముందుకు రాకపోయినా, ఓటరు లిస్టు, నామినేషన్ పత్రాలను తీసుకోవడానకి మాత్రం అభ్యర్థులు ఎక్కువ ఆసక్తి ప్రదర్శించారు. దీంతో పలు కార్యాలయాల వద్ద అభ్యర్థుల హడావిడి కనిపించింది. అభ్యర్థులకు సెంటిమెంట్ ఎక్కువగా ఉండడంతో నామినేషన్ వేయడానికి సోమవారం ఎక్కువగా ఆసక్తి ప్రదర్శించకపోయినప్పటికీ, శుక్రవారం అమావాస్య కావడంతో ఎక్కువ మొత్తంలో నామినేషన్ వేసే అవకాశం ఉంది.
మొదటి రోజు నామినేషన్లు లేవు
Published Tue, Sep 27 2016 2:45 AM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
Advertisement