nomination papers
-
మున్ముందు మంచి అవకాశాలు
కొడంగల్: ఈ ఎన్నికలు కేసీఆర్‌కు, కొడంగల్ ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ను బంగాళాఖాతంలో కలిపేలా తీర్పు ఇవ్వాలని కోరారు. సోమవారం పెద్దసంఖ్యలో కార్యకర్తలు, అభిమానులతో తరలివెళ్లిన రేవంత్, కొడంగల్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేశారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసుఫ్‌తో కలసి రిటర్నింగ్ అధికారి లింగ్యానాయక్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి తనది మాత్ర మే కాదని, కొడంగల్‌లోని ప్రతి బిడ్డా తనను తాను పీసీసీ అధ్యక్షుడిగా భావించాలని పిలుపునిచ్చారు. మీ ఆశీర్వాదంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని, కొడంగల్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ ప్రాంతం పేరు నిలబెట్టానని అన్నారు. సోనియా మనకు మంచి అవకాశాలు ఇస్తున్నారని, ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే గొప్ప అవకాశం కొడంగల్ ప్రజలకు వచ్చిందని చెప్పారు. భవిష్యత్తులోనూ మంచి అవకాశాలు రావచ్చు అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే బాధ్యత మీదేనని అన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు వచ్చిన మెజార్టీకన్నా ఎక్కువ మెజార్టీ అందించి చూపించాలని కోరారు. రెండేళ్లలో దశ, దిశ మారుస్తాం రాష్ట్రంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ల మాదిరిగా కొడంగల్‌ను ఎందుకు అభివృద్ధి చేయలేదని కేసీఆర్‌ను రేవంత్ నిలదీశారు. దత్తత కాదు.. ధైర్యం ఉంటే కొడంగల్‌లో పోటీ చేయాలని సవాల్ విసిరినా స్వీకరించలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండేళ్లలో రాష్ట్రం దశ, దిశ మారుతుందని చెప్పారు. హెలీకాప్టర్ ద్వారా కొడంగల్‌కు చేరుకున్న ఆయన ముందుగా గాడిబాయి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన నివాసంలో సర్వమత ప్రార్థనలు చేశారు. కేసుల్లేవు..ఎఫ్‌ఐఆర్‌లున్నాయి రిటర్నింగ్ అధికారికి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో రేవంత్‌రెడ్డి తన ఆస్తులు అప్పులతో పాటు తనపై ఉన్న కేసుల వివరాలను వెల్లడించారు. క్రిమినల్ కేసులు లేవని, రాష్ట్రంలోని పలు పీఎస్‌లలో తనపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని పేర్కొన్నారు. 2022– 23 ఆర్థిక సంవత్సరానికి తన ఆదాయం రూ.13,76,700, తన సతీమణి గీతారెడ్డి ఆదాయం రూ.11,13,490 అని తెలిపారు. వ్యవసాయం ద్వారా రూ.3,15,000 ఆదాయం వస్తుందని వివరించారు. సెక్రటేరియేట్ బ్రాంచ్‌లో రూ.3,08,954 డిపాజిట్, ఢిల్లీ పార్లమెంట్ ఎస్బీఐ బ్రాంచ్‌లో రూ.17,17,461 డిపాజిట్ ఉన్నట్లు తెలిపారు. హోండా సిటీ కారు, మెర్సిడెస్ బెంజ్ కారు, 1,235 గ్రాముల బంగారం, 9,700 గ్రాముల వెండి ఉన్నట్లు వెల్లడించారు. -
పైళ్ల శేఖర్‌రెడ్డి ఆస్తుల విలువ రూ.227.78 కోట్లు
భువనగిరి: భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి ఆస్తులు గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీగా పెరిగాయి. శేఖర్‌రెడ్డి తరఫున బీఆర్ఎస్ నాయకులు శనివారం భువనగిరి రిటర్నింగ్ ఆఫీసర్(ఆర్ఓ) కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలలో శేఖర్‌రెడ్డి పేరు మీద మొత్తం రూ.159.50 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉండగా.. ఆయన సతీమణి వనితారెడ్డి పేరు మీద రూ.68.28కోట్ల ఆస్తులు ఉన్నట్లు చూపించారు. ఇందులో ఆయన పేరు మీద రూ.120,70,33,601, ఆయన భార్య పేరిట రూ.4,36,26,517 చరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. శేఖర్‌రెడ్డి కుమార్తె పేరిట రూ.1,75,064, కుమారుడు పేరిట రూ.49,000 చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో చూపించారు. శేఖర్‌రెడ్డి పేరిట స్థిరాస్తులు రూ.38,80,64,800, ఆయన సతీమణి పేరిట రూ.63,92,36,495 స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం శేఖర్‌రెడ్డి చేతిలో రూ.3,21,510, ఆయన సతీమణి చేతిలో రూ.9,25,138 నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. శేఖర్‌రెడ్డి పేరున రూ.90,61,17,133, ఆయన భార్య పేరు మీద రూ.22,13,96,627 అప్పులు ఉన్నట్లు చూపించారు. 2018 కంటే పెరిగిన ఆస్తులు.. 2018 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం పైళ్ల శేఖర్‌రెడ్డి పేరున రూ.69,00,80,939, ఆయన సతీమణి పేరుమీద రూ.5,39,68,923 విలువ చేసే చరాస్తులు ఉన్నాయి. అదేవిధంగా అప్పట్లో గతంలో ఆయన పేరు మీద రూ.1,59,25,323, ఆయన సతీమణి పేరున రూ.15,03,18,620 విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయి. ► ఆయన పేరుమీద రూ.159.50 కోట్లు.. ► సతీమణి పేరుమీద రూ.68.28 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడి ► గతంతో పోలిస్తే పెరిగిన ఆస్తులు -
గురుదాస్‌పూర్‌లో సన్నీ డియోల్ నామినేషన్
చండీగఢ్ : బాలీవుడ్ నటుడు, ఇటీవల బీజేపీలో చేరిన సన్నీ డియోల్ సోమవారం ఆ పార్టీ తరపున పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అంతకుముందు సన్నీ డియోల్ పార్టీ నేతలు వెంటరాగా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో ప్రార్ధనలు చేశారు. దుర్గా మాత ఆలయంలోనూ ఆయన పూజలు చేశారు. సన్నీ డియోల్ ఈనెల 23న ఢిల్లీలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్‌ల సమక్షంలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ దేశానికి ఎంతో సేవ చేశారని, మరో ఐదేళ్లు ఆయనే ప్రధానిగా ఉండాలన్నది తన కోరికని, మన యువతకు మోదీజీ వంటి వ్యక్తుల అవసరం ఎంతైనా ఉందని పార్టీలో చేరిన అనంతరం సన్నీ డియోల్ వ్యాఖ్యానించారు. తన తండ్రి ధర్మేంద్ర అటల్జీతో పనిచేసినట్టుగానే మోదీకి మద్దతుగా తాను ముందుకు వచ్చానని చెప్పుకొచ్చారు. కాగా గురుదాస్‌పూర్ నుంచి అంతకుముందు బీజేపీ తరపున వినోద్ ఖన్నా ప్రాతినిధ్యం వహించారు. వినోద్ ఖన్నా భార్య కవితా ఖన్నాకు బీజేపీ టికెట్ ఖాయమవగా, చివరినిమిషంలో సన్నీ డియోల్ అభ్యర్థిత్వానికి కాషాయ పార్టీ మొగ్గుచూపింది. -
ఉత్కంఠ రేపుతున్న లోకేష్ నామినేషన్..!
సాక్షి, అమరావతి : సీఎం చంద్రబాబు తనయుడు, నారా లోకేష్ నామినేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ పేపర్లలో తప్పిదం కారణంగా లోకేష్ నామినేషన్ ఆమోదం పొందుతుందో లేదోనని టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. టీడీపీ మంగళగిరి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన లోకేష్ ఇంటి అడ్రస్‌ను తాడేపల్లి మండలం ఉండవల్లిగా పేర్కొన్నారు. దీనిని కృష్ణా జిల్లాకు చెందిన లాయర్ సీతారామ్ నోటరీ చేశారు.అయితే, తన పరిధిలోకి రాని గ్రామాన్ని నోటరీ ఎలా చేస్తారని వైఎస్సార్సీపీ అభ్యర్థి, మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెప్పాలని నిలదీశారు. వివరణ ఇచ్చేందుకు లోకేష్ తరపు న్యాయవాది సీతారామ్ కొంత సమయం కావాలని రిటర్నింగ్ అధికారి వసుమా బేగంను కోరారు. నోటరీ రూల్స్ ప్రకారం ఈ నామినేషన్ చెల్లదన్న వాదనలు వినిపిస్తున్నాయి. తప్పుడు నామినేషన్ పత్రాలు ఇచ్చినందుకు చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎన్నికల అధికారులు పక్షపాత రహితంగా నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఒకవేళ లోకేష్, అతని తరపు న్యాయవాదులు ఇచ్చిన వివరణతో ఎన్నికల అధికారి సంతృప్తి చెందకపోతే... నామినేషన్‌ను తిరస్కరించే ఆస్కారం కూడా ఉంటుంది. అయితే, ఇది పొరపాటే తప్ప.. తప్పిదం కాదంటున్న టీడీపీ నేతలు...అంత మాత్రాన నామినేషన్ తిరస్కరించే పరిస్థితి ఉండదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క లోకేష్ నామినేషన్ ఆమోదానికి ఉన్నతస్థాయిలో ఒత్తిడులు పనిచేస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి -
కేసీఆర్ ఆస్తులు.. అప్పులు
సాక్షి, గజ్వేల్(సిద్దిపేట జిల్లా): ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం గజ్వేల్‌లో తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఫాం–26తోపాటు ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను అఫిడవిట్లో సమర్పించారు. తనకు ఎటువంటి సొంత వాహనాలు లేవని కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ మొత్తం ఆస్తుల విలువ- రూ.22,60,77,936 చరాస్తులు- రూ.10,40,77,946 స్థిరాస్తులు- రూ.12.20 కోట్లు(పొలం, ఇళ్లు, ఫామ్‌హౌస్ వగైరా..) ఫిక్స్డ్ డిపాజిట్లు- రూ.5,63,73,946 తెలంగాణ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పెట్టుబడులు- రూ.55,00,000 తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పెట్టుబడులు- రూ.4,16,25,000 కేసీఆర్ వద్ద ఉన్న బంగారం- 75 గ్రాములు (విలువ రూ.2,40,000) మొత్తం అప్పులు- రూ.8,88,47,570 ఇందులో కుమారుడు కేటీఆర్‌కు ఇవ్వాల్సిన బాకీ రూ.82,82,570 కోడలు శైలిమ వద్ద తీసుకున్న అప్పు- రూ.24,65,000 బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏడాదికి కడుతున్న బీమా- రూ.99 వేలు తెలంగాణ ఉద్యమ సమయంలో తనపై 64 కేసులు ఉన్నట్లు కేసీఆర్ తన అఫిడవిట్లో చూపించారు. కేసీఆర్ సతీమణి శోభ పేరుమీద రూ.94,59,779 విలువైన ఆస్తులున్నాయి. ఇందులో బంగారం, వజ్రాలు, ముత్యాలు, ఇతర ఆభరణాల విలువే అధికం. ఆమె వద్ద 2.2 కేజీల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వాటి విలువ రూ. 93,66,184. -
జయ స్పృహలో ఉండే సంతకం చేశారు!
టీ.నగర్: తమిళనాడులో 3 నియోజకవర్గాల ఉపఎన్నికల కోసం దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో జయలలిత స్పృహలో ఉండగానే సంతకం చేసినట్లు ఆమె మృతిపై విచారణ జరుపుతున్న ఆర్ముగస్వామి కమిషన్ వెల్లడించింది. ఆమె అపోలో ఆసుపత్రిలో ఉన్నకాలంలో రాష్ట్రంలో 3 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. రెండాకుల చిహ్నం కేటాయింపునకు సంబంధించిన బీ ఫారంలో జయలలిత వేలిముద్ర ఉంది. వేలిముద్రలు తీసుకున్న సమయంలో జయ స్పృహలోనే ఉన్నట్లు వైద్యుడు బాలాజీ వాంగ్మూలం ఇచ్చారు. బాలాజీ వాంగ్మూలం వాస్తవమేనని విచారణ కమిషన్ తాజాగా నిర్ధారించింది. ఆసుపత్రి గదిలో జయలలిత వేలిముద్రలు తీసుకున్నది నిజమేనని, తర్వాత ఆమె వేలికి అంటుకున్న సిరాను బాలాజీ తుడిచేందుకు ప్రయత్నించగా ఆయన్ని అడ్డుకుని శశికళ సిరాను తుడిచినట్లు తెలిపింది. -
మొదటి రోజు నామినేషన్లు లేవు
నామినేషన్ పత్రాలు తీసుకోవడానికి ఆసక్తి తిరువళ్లూరు: స్థానిక సంస్థలకు ఎన్నికల నగరా మోగిన నేపథ్యంలో మొదటి రోజు పూండీ, కడంబత్తూరు, ఈకాడు యూనియన్ కార్యాలయాలకు నామినేషన్ వేయడానికి అభ్యర్థులు ఎవరూ రాకపోవడంతో బోసిపోయింది. యూనియన్, జిల్లా కౌన్సిలర్, పంచాయతీ అధ్యక్షుడు, వార్డు సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్, మేజర్ పంచాయతీ, వార్డు మెంబర్లకు వచ్చే నెలలో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ తీసుకునే ప్రక్రియను సోమవారం నుంచి ప్రారంభిస్తున్న ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నామినేషన్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైనా ఒక్క నామినేషన్ కూడా నమోదు కాలేదు. దీంతో ఏఆర్వోల కార్యాలయాలు బోసిపోయాయి. నామినేషన్ వేయడాని ఎవరూ ముందుకు రాకపోయినా, ఓటరు లిస్టు, నామినేషన్ పత్రాలను తీసుకోవడానకి మాత్రం అభ్యర్థులు ఎక్కువ ఆసక్తి ప్రదర్శించారు. దీంతో పలు కార్యాలయాల వద్ద అభ్యర్థుల హడావిడి కనిపించింది. అభ్యర్థులకు సెంటిమెంట్ ఎక్కువగా ఉండడంతో నామినేషన్ వేయడానికి సోమవారం ఎక్కువగా ఆసక్తి ప్రదర్శించకపోయినప్పటికీ, శుక్రవారం అమావాస్య కావడంతో ఎక్కువ మొత్తంలో నామినేషన్ వేసే అవకాశం ఉంది. -
రాజ్యసభకు మనోహర్ పారికర్ నామినేషన్ దాఖలు
న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖామంత్రి మనోహర్ పారికర్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యేలా కేంద్రప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. గోవా ముఖ్యమంత్రి పదవికి మనోహర్ పారికర్ రాజీనామా చేసి.. నవంబర్ 9 తేదిన జరిగిన తాజా మంత్రివర్గ విస్తరణలో రక్షణ శాఖామంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కేంద్రమంత్రిగా పదవి చేపట్టిన మనోహర్ పారికర్ ఉభయసభల్లోనూ సభ్యుడి కానుందున ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
వైఎస్ఆర్సీపీకి విప్ జారీ అధికారం
శ్రీకాకుళం: మండల, జిల్లాపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు సంబంధించి విప్ జారీ చేసే అధికారం వైఎస్ఆర్సీపీకి కూడా ఉందని జెడ్పీ సీఈవో నాగార్జునసాగర్ స్పష్టం చేశారు. ఈ విషయమై ఎన్నికల సంఘం నుంచి వివరణ తీసుకున్నామన్నారు. ఆ పార్టీకి కూడా విప్ జారీ చేసే అధికారం ఉన్నట్టు తెలిపారని చెప్పారు. మండల, జిల్లాపరిషత్ ఎన్నికల్లో సభ్యులు అనుసరించాల్సిన విధివిధానాలను ఆయన విలేకరులకు బుధవారం వెల్లడించారు. విప్ ధిక్కరించిన వారికి పదవి పోయే ప్రమాదం ఉందన్నారు. అయితే వారు విప్‌ను ధిక్కరించి వేసే ఓటు మాత్రం చెల్లుబాటు అవుతుందన్నారు. విప్‌ను జారీ చేసే వారుగానీ, పార్టీ ప్రతినిధులుగానీ విప్‌ను ధిక్కరించిన విషయమై మూడు రోజుల్లోగా తెలియజేస్తే ఏడు రోజుల్లోగా సంబంధిత సభ్యులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆ తరువాత అనర్హతపై ప్రిసైడింగ్ అధికారి నిర్ణయం తీసుకుంటారని వివరించారు. జూలై 4న మండల పరిషత్ అధ్యక్ష, 5న జిల్లాపరిషత్ అధ్యక్ష ఎన్నికలు పరోక్ష పద్ధతిన జరుగుతాయన్నారు. ముందుగా కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తామని.. వారు మండల పరిధిలో ఓటరై ఉండడంతోపాటు మైనార్టీ సామాజిక వర్గానికి చెంది ఉండాలన్నారు. ఉదయం 10 గంటలలోగా నామినేషన్ దాఖలు చేయాలని వాటిపై పరిశీలన పూర్తి చేసిన అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఎన్నిక ఉంటుందన్నారు. ఎన్నిక అనివార్యమైతే చేతులెత్తే పద్ధతిన ఓటింగ్ నిర్వహిస్తామన్నారు. తరువాత మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలను ప్రత్యేక సమావేశం ద్వారా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఎన్నిక అనివార్యమైతే కేవలం సభ్యులు మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుందని కో-ఆప్షన్ సభ్యులకు ఓటింగ్ చేసే అధికారం లేదన్నారు. మండల, జిల్లాపరిషత్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యులు ఉండరని పేర్కొన్నారు. -
నయాపైసా లేదు..
సాక్షి, ముంబై: సాధారణంగా రాజకీయ నాయకులంటే ఖద్దరు చొక్కా..శిల్కు ప్యాంట్.. చేతి నాలుగు వేళ్లకు ఉంగరాలు.. పక్కన ఇద్దరు పీఏలు.. ఇలా కనిపించేవారికే గౌరవం, మర్యాద, జేజేలు దక్కుతాయనేది జగమెరిగిన సత్యం.. దీంతోపాటు ఎన్నికలంటే వీరి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే.. కనీసం కోటీశ్వరుడై ఉండాలి.. డబ్బు మంచినీటిప్రాయంగా ఖర్చుపెట్టగలగాలి.. అప్పుడే మందీమార్బలం వారి వెంట ఉంటారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి ఎంపీ అభ్యర్థులుగా నిలుచున్నవారు నామినేషన్ల సమయంలో తమకు ఉన్న ఆస్తులు,అప్పుల వివరాలను అందజేశారు. వాటిలో కొంతమంది తమ ఆస్తులను రూ.వందల కోట్లలో చూపిస్తే.. మరి కొందరు కొంచెం తక్కువ మొత్తంలో చూపించారు. కాని రాష్ర్టవ్యాప్తం 19 మంది తమ పేరిట ఎలాంటి వాహనాలు, సొంత ఇల్లు, బంగళా, బంగారం, వెండి, భూములు, బ్యాంక్ డిపాజిట్లు, బాండ్లు, షేర్లు లేవని తమ అఫిడవిట్లలో పేర్కొన్నారు. వీరు పోటీల్లో ఉన్న నియోజకవర్గాల్లో ఇతర పార్టీల వాళ్లు కోట్లాదిరూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకుంటుండగా, వీరు మాత్రం పైసా ఖర్చు పెట్టకుం డానే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇదివరకు నామినేషన్ పత్రాలు దాఖ లు చేసిన వివిధ పార్టీల అభ్యర్థులు తమ ఆస్తులు ఇంతా... అంటూ ఎంతో కొంత అందులో పొందుపర్చారు. అవన్ని నమ్మశక్యంగా లేవని, తప్పుల తడకగా చూపించారని అనేక మంది ఆరోపించారు. కాని తమవద్ద నయా పైసా లేదని పేర్కొన్న ఈ 19 మంది అభ్యర్థులను నిలదీయాలనే ఆలోచన ఇంతవరకు ఎవరికీ రాకపోవడం గమనార్హం. ఎన్నికల సమయంలో ప్రతీ అభ్యర్థి రూ.70 లక్షలలోపు ఖర్చు చేయాలని ఎన్నికల కమిషన్ అవకాశం ఇచ్చింది. కాని చేతిలో చిల్లిగవ్వలేదని ప్రకటించిన ఈ అభ్యర్థులు ఎన్నికల సంఘానికి తమ ఎన్నికల ప్రచార ఖర్చు ఎంతమేర చూపిస్తారనేది ఆసక్తిగా మారింది. నాగపూర్‌కు చెందిన శశికళా అహ్మద్, రాజేశ్ సాధన్కర్, చందా మాన్వాత్కర్, ధీరజ్ గజబియే ఈ నలుగురు అభ్యర్థులు కూలి పనులు చేస్తూ ఒంటరిగానే సైకిల్‌పై సొంతంగా ప్రచారం చేసుకుంటున్నారు. విదర్భకు చెందిన పోస్టు గ్రాడ్యూయేషన్ పూర్తిచేసిన యావత్మాల్కు చెందిన ఉత్తం కాంబ్లే, చంద్రాపూర్‌కు చెందిన వినోద్ మేశ్రాం, అమరావతికి చెందిన కిరణతాయి కోకాటే, భండార-గోందియాకు చెందిన ధనంజయ్ రాజ్భోగే, అకోలాకు చెందిన సందీప్ వాంఖేడే తమవద్ద చిల్లిగవ్వలేదని అఫిడెవిట్‌లో స్పష్టం చేశారు. వీరితోపాటు బీడ్‌కు చెందిన హరి హర్ భగావత్, వీర్ శేష్రావ్ చోఖోబా, సుమిత్ర పవార్, ప్రశాంత్ ససాణే, అశోక్ సోనవ ణే కూడా తమ అఫిడవిట్లలో ఆస్తులు లేనట్లే చూపించారు. మావల్ నియోజక వర్గానికి చెందిన సీమా మాణిక్, సతారాకు చెందిన విజయ్ పాటిల్, జాల్నాకు చెంది న విఠల్ శేల్కే, ఔరంగాబాద్‌కు చెందిన భానుదాస్ సరోదే, జల్గావ్కు చెందిన సందీప్ పాటిల్, నాసిక్‌కు చెందిన మహేశ్ అవ్హాడ్ ఉన్నారు. వీరంతా నయాపైసా లేదని అఫిడవిట్లో స్పష్టం చేసినప్పటికీ ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం శోచనీయం. మరో విశేషమేమిటంటే ఇందులో బీడ్ నుంచి పోటీచేస్తున్న సుమిత్ర పవార్ నిరక్షరాస్యులు కాగా, యావత్మాల్ నుంచి పోటీచేస్తున్న హరిహర్ భాగవత్ పోస్టుగ్రాడ్యు యేట్. ఈ వివరాలను రాష్ట ఎన్నికల అధికారి మాధవి సర్దేశ్ముఖ్ వెల్లడించారు. -
టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నామినేషన్
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కేశినేని శ్రీనివాస్(నాని) బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కెనాల్ రోడ్డులోని వినాయకుడు గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ర్యాలీగా బయలుదేరి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇంతకు ముందు స్థానికేతరులు ఈ ప్రాంతానికి ఎంపీగా ఎన్నికయ్యారని, అందువల్ల వారికి స్థానిక సమస్యలపై పూర్తి అవగాహనలేదని చెప్పారు. తాను ఇక్కడి వాడినికావడంతో నియోజకవర్గ పరిధిలోని అన్ని సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. తాను గెలిస్తే విజయవాడ నగర అభివృద్ధికి పెద్ద పీట వేస్తానని, ముఖ్యంగా పేద,మధ్య తరగతి వర్గాల ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన పై దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. తాను ఏసామాజిక వర్గానికి వ్యతిరేకం కాదని, అన్ని సామాజికవర్గాలను కలుపుకుని వెళతానని తెలిపారు. కేశినేనిని పార్లమెంట్ గేటు తాకనివ్వమంటూ కొంతమంది నేతలు చేస్తున్న హడావుడి పై ప్రశ్నించగా, అది నిర్ణయించాల్సింది ప్రజలు అని, వారు కాదని, తన గెలుపుపై పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. ర్యాలీలో అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్నతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. -
నిబంధనలు పాటించాలి
గుంటూరు సిటీ, న్యూస్‌లైన్: పార్లమెంట్, శాసనసభ ఎన్నికలకు ఈనెల 12వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో గురువారం ఉదయం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టర్ తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే.. ఈనెల 12 నుంచి 19వ తేదీవరకు రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. ప్రభుత్వ సెలవుదినాలైన 13, 14, 18 తేదీల్లో నామినేషన్ పత్రాలు స్వీకరించరు. ఈనెల 21న నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుంది. 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టరు, సహాయ రిటర్నింగ్ అధికారిగా స్పెషల్ కలెక్టర్ వేణుగోపాల్ వ్యవహరిస్తారు. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా జిల్లా సంయుక్త కలెక్టరు, సహాయ రిటర్నింగ్ అధికారిగా సివిల్ సప్లయీస్ అధికారి రమేష్ వ్యవహరిస్తారు. పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసే వారు కలెక్టరేట్‌లోగల రిటర్నింగ్ అధికారుల వద్ద నామినేషన్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి ఆయా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల వద్ద నామినేషన్ దాఖలు చేయాలి.పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసేవారు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.25వేలు, శాసనసభ అభ్యర్థిగా నామినేషన్వేసేవారు రూ.10వేలు సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే పార్లమెంట్‌కు రూ.12,500, శాసన సభకు రూ.5 వేలు డిపాజిట్ చేస్తే సరి. ఈ డిపాజిట్లను నగదుగాగానీ, ట్రెజరీ చలానా రూపంలో మాత్రమే చెల్లించాలి. నామినేషన్ పత్రాలతోపాటు అఫిడవిట్‌ను అభ్యర్థులు సమర్పించాలి, అఫిడవిట్లోగల ప్రతీ కాలం తప్పనిసరిగా పూరించాలి. అసంపూర్తిగా ఉన్న అఫిడవిట్లను పరిశీలన సమయంలో తిరస్కరించే అధికారం రిటర్నింగ్ అధికారికి ఉంటుంది. నామినేషన్ పత్రాలు ఇతర డాక్యుమెంటేషన్‌తో అభ్యర్థితోపాటు నలుగురు మాత్రమే రిటర్నింగ్ అధికారి వద్దకు రావాలి. 200 మీటర్ల బయట వరకు మాత్రమే ఊరేగింపులు, వాహనాలు అనుమతిస్తారు. ఊరేగింపులకు 48 గంటల ముందుగా అధికారుల నుంచి అనుమతి పొందాలి. అఫిడవిట్ పత్రాలకు సంబంధించి మొదటి పేజీలో రూ.10 విలువగల స్టాంపు పేపరు, అభ్యర్థి సంతకం నోటరీ అటిస్టేషన్ చేయించాలి. ప్రతీ పేపరుపై అభ్యర్థి సంతకం నోటరీ అటిస్టేషన్ ఉండేలా చూడాలి.ఆన్‌లైన్‌ద్వారా కూడా అఫిడవిట్, నామినేషన్ దాఖలు చేసుకునే అవకాశముంది.పై వివరాలను నోటీసు బోర్డు, వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది. తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు.. తప్పుడు అఫిడవిట్లు ఇచ్చిన వారిపై భవిష్యత్తులో కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపడుతుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా జాతీయ బ్యాంకులో వ్యక్తిగత ఖాతా తెరవాలి. ఈ ఖాతా ద్వారానే ఎన్నికల ఖర్చులు చేపట్టాల్సి ఉంటుంది. నామినేషన్ పత్రంతోపాటు ఈ బ్యాంక్ ఖాతా నంబరును జతపరచాలి.అభ్యర్థి సొంత నియోజకవర్గానికి చెందిన ఓటరు కాకపోతే ఏ నియోజకవర్గంలో ఓటరు జాబితాలో పేరు ఉందో ఆ జాబితాను సర్టిఫై చేయించి నామినేషన్ పత్రంతో జతపరచి సమర్పించాలి. వినుకొండ, మాచర్ల, గురజాల పెదకూరపాటు నియోజక వర్గాల్లో పోలింగ్ సమయం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఉంటుంది. మిగిలిన 13 నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలనుంచి సాయంత్రం 6గంటల వరకు ఉంటుంది. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టరు వివేక్‌యాదవ్, డీఆర్వో కె.నాగబాబు, రూరల్, అర్బన్ ఎస్పీలు జె.సత్యన్నారాయణ, జెట్టి గోపీనాథ్, పార్టీల నాయకులు ఆంజనేయులు (కాంగ్రెస్), ఎం.సుబ్బారావు(టీడీపీ), వైవీ సుబ్బారావు(బీజేపీ), కాళిదాసు, రమాదేవి(సీపీఎం), వాసు(బీఎస్పీ)తదితరులు పాల్గొన్నారు. -
సారథుల సమరం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఒకరు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు.. మరొకరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు.. ఇంకొకరు వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్.. ఈ ముగ్గురు ఒకే స్థానం నుంచి సార్వత్రిక ఎన్నికల సమరంలోకి దిగితే.. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఇబ్రహీంపట్నంలో నెలకొంది. మూడు ప్రధాన పార్టీలకు చెందిన జిల్లా బాధ్యులు ఇక్కడి నుంచి పోటీ చేయడం ఆసక్తిని రేపుతోంది. ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ ఇప్పటికే భారీ ఎత్తున కార్యకర్తలతో తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్ కూడా అభిమానుల మధ్య నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అనుచరగణంతో నామినేషన్ సమర్పించారు. ఈ ముగ్గురు నేతలు కూడా ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన వారే కావడం విశేషం. ప్రధానంగా పోటీ కూడా ఈ ముగ్గురి మధ్యే నెలకొంది. మొత్తంగా పార్టీ జిల్లా సారథులు ముగ్గురూ ఒకే సీటుకోసం పోటీపడుతుండడం స్థానికంగా ఆసక్తి కలిగిస్తోంది. అంతిమంగా గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. -
పెండ్యాల సర్పంచి ఎన్నికకు మళ్లీ గండం!
=ఎస్సీ రిజర్వుడు =గ్రామంలో వారెవరూ లేనందునే... =ఓసీ.బీసీలకు కేటాయించాలని గ్రామస్తుల డిమాండ్ కంచికచర్ల రూరల్, న్యూస్‌లైన్ : మండల పరిధిలోని పెండ్యాల గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. గతంలో ఈ గ్రామ పంచాయతీ సర్పంచి పదవిని ఎస్సీలకు కేటాయించారు. గ్రామంలో ఎస్సీలు లేకపోవడంతో ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. అంతేకాకుండా వార్డు సభ్యులకు సైతం ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో గతంలో ఇక్కడ పంచాయతీ ఎన్నికలు నిలిచిపోయిన సంగతి విదితమే. అయినప్పటికీ అధికారులు ఈ గ్రామ సర్పంచి పదవిని తిరిగి ఎస్సీలకే కేటాయిస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం సర్వత్రా విమర్శలకు గురవుతుంది. గతంలో నోటిఫికేషన్ జారీ అయిన సమయంలో ఈ గ్రామంలో ఎస్సీలు ఎవరూ నివాసం ఉండటంలేదని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఎస్సీలు ఎవరూ లేనందున ఓసీలకుగానీ, బీసీలకుగానీ కేటాయించాలని గ్రామస్తులు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో గ్రామనౌకర్లు, రేషన్ డీలరు సైతం గ్రామంలో ఉండకుండా పక్కనే ఉన్న కీసర గ్రామంలో నివాసముంటున్నారని అప్పుడే అధికారులకు తెలిపారు. పంచాయతీ ఎన్నికలు ముందు తయారు చేసిన ఓటర్ల జాబితాలో 10 మంది ఎస్సీ ఓటర్లున్నారు. వారిలో గ్రామ నౌకర్లు వారి కుటుంబ సభ్యుల ఓట్లు నాలుగు, ప్రభుత్వ వసతి గృహంలో పనిచేస్తున్న ముగ్గురి ఓట్లు, రేషన్ డీలరు కుటుంబానికి సంబంధించి రెండు ఓట్లు, వీఆర్వో ఓటుతో కలిపి మొత్తం 10 మందికి చెందిన ఎస్సీల పేర్లు ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్నాయి. వీరిలో ఎవరూ గ్రామంలో నివాసముండటం లేదని గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు 2013 జూలై 5న గ్రామంలో పూర్తిస్థాయిలో విచారణ జరిపి రిపోర్టు ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు మండల రెవెన్యూ అధికారులు గ్రామంలో పూర్తిస్థాయిలో విచారణచేసి గ్రామంలో వీఆర్వో(ఉద్యోగరీత్యా) మినహా మిగిలిన ఎస్సీలు ఎవరూ ఉండటం లేదని, ఓటర్ల జాబితాలో నుంచి 9 మంది పేర్లను తొలగిస్తున్నట్లు తహశీల్దార్ జీ విక్టర్‌బాబు 2013 ఆగస్టు 4న ప్రకటించారు. గ్రామంలో వీఆర్వో మినహా ఓటర్ల జాబితాలో ఎస్సీలు ఎవరూలేనప్పటికీ తిరిగి సర్పంచి పదవిని ఎస్సీలకు కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు ఇవ్వడం పలు విమర్శలకు తావిస్తుందని గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ షేక్ అన్వర్, మాజీ సర్పంచులు అబ్దుల్ కరీం, షేక్ ఖాజాబాషా, షేక్ జోర్‌ఖాన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ గ్రామానికి జరుగనున్న పంచాయతీ ఎన్నికలు మరోసారి నిలిచిపోనున్నాయని తెలుస్తోంది. ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు.... పెండ్యాల గ్రామ పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికకు ఈ సారీ ఒక్క నామినేషన్ రాలేదని ఎన్నికల అధికారి టీ శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. మూడు నుంచి ఆరో తేదీ వరకు నామినేషన్ గడువు ఉందని ఎస్సీ జనరల్ అభ్యర్థులు నామినేషన్ వేసుకోవచ్చని ఆయన చెప్పారు.