రాజ్యసభకు మనోహర్ పారికర్ నామినేషన్ దాఖలు
రాజ్యసభకు మనోహర్ పారికర్ నామినేషన్ దాఖలు
Published Mon, Nov 10 2014 1:21 PM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM
న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖామంత్రి మనోహర్ పారికర్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యేలా కేంద్రప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది.
గోవా ముఖ్యమంత్రి పదవికి మనోహర్ పారికర్ రాజీనామా చేసి.. నవంబర్ 9 తేదిన జరిగిన తాజా మంత్రివర్గ విస్తరణలో రక్షణ శాఖామంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కేంద్రమంత్రిగా పదవి చేపట్టిన మనోహర్ పారికర్ ఉభయసభల్లోనూ సభ్యుడి కానుందున ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
Advertisement
Advertisement