భువనగిరి: భువనగిరి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి ఆస్తులు గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీగా పెరిగాయి. శేఖర్‌రెడ్డి తరఫున బీఆర్‌ఎస్ నాయకులు శనివారం భువనగిరి రిటర్నింగ్ ఆఫీసర్(ఆర్‌ఓ) కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలలో శేఖర్‌రెడ్డి పేరు మీద మొత్తం రూ.159.50 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉండగా.. ఆయన సతీమణి వనితారెడ్డి పేరు మీద రూ.68.28కోట్ల ఆస్తులు ఉన్నట్లు చూపించారు. ఇందులో ఆయన పేరు మీద రూ.120,70,33,601, ఆయన భార్య పేరిట రూ.4,36,26,517 చరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు.
శేఖర్‌రెడ్డి కుమార్తె పేరిట రూ.1,75,064, కుమారుడు పేరిట రూ.49,000 చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపించారు. శేఖర్‌రెడ్డి పేరిట స్థిరాస్తులు రూ.38,80,64,800, ఆయన సతీమణి పేరిట రూ.63,92,36,495 స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం శేఖర్‌రెడ్డి చేతిలో రూ.3,21,510, ఆయన సతీమణి చేతిలో రూ.9,25,138 నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. శేఖర్‌రెడ్డి పేరున రూ.90,61,17,133, ఆయన భార్య పేరు మీద రూ.22,13,96,627 అప్పులు ఉన్నట్లు చూపించారు.
2018 కంటే పెరిగిన ఆస్తులు..
2018 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం పైళ్ల శేఖర్‌రెడ్డి పేరున రూ.69,00,80,939, ఆయన సతీమణి పేరుమీద రూ.5,39,68,923 విలువ చేసే చరాస్తులు ఉన్నాయి. అదేవిధంగా అప్పట్లో గతంలో ఆయన పేరు మీద రూ.1,59,25,323, ఆయన సతీమణి పేరున రూ.15,03,18,620 విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయి.
► ఆయన పేరుమీద రూ.159.50 కోట్లు..
► సతీమణి పేరుమీద రూ.68.28 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడి
► గతంతో పోలిస్తే పెరిగిన ఆస్తులు
Comments
Please login to add a commentAdd a comment